ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుంది – గుడివాడ అమర్నాథ్

-

ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుందని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ హైదరాబాద్‌ లో రేసింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, తెలుగు వారిగా హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా నిలవడం గర్వకారణం గా ఉందని తెలిపారు.

హైదరాబాద్ తెలంగాణ, ఏపి ప్రజలు కలిసి నిర్మించిన నగరమని వెల్లడించారు. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుందని వివరించారు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించే దిశగా ఏపిని అభివృద్ది చేస్తామని… వైజాగ్ ను హైదరాబాద్ మాదిరి క్యాపిటల్ గా డెవలప్ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news