కరోనాతో కలిసి జీవించాల్సిందే.. ఈ విషయాన్ని దేశాధినేతలు సైతం తేల్చి చెప్పేశారు. కాకపోతే ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దీంతో మాస్కులు, సానిటైజర్లు మన జీవితంలో ఒక బాగమైపోయాయి. మాస్కు ధరించకపోతే ఫైన్ అనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గుజరాత్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రి ఈశ్వరీసిన్హా పటేల్ మాస్క్ లేకుండా రావడంతో అధికారులు ఆయనకు రూ. 200 జరిమానా విధించారు. ఆయన తప్ప మిగిలిన మంత్రులంతా మాస్కులను ధరించే సమావేశానికి వచ్చారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ జరిమానాను విధించారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో పటేల్ ముచ్చటించారు. జరిమానాను చెల్లించినట్టు రసీదును చూపించారు. వాస్తవానికి తాను మాస్కును ఎప్పుడూ ధరించే ఉంటానని… అయితే, కారు దిగే సమయంలో మర్చిపోయానని చెప్పారు.
మాస్క్ లేకుండా వచ్చినందుకు మంత్రికి జరిమానా..!
-