గుప్పెడంతమనసు ఎపిసోడ్ 272: ఈ విజయం జగతి, వసూధారలదే అని మీడియా ముందు ఒప్పుకున్న రిషీ

-

 గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కాలేజ్ లో రిషీ ఇంటర్వూ స్టాట్ అవుతుంది. జర్నలిస్ట్ రిషీని ప్రశ్నలు అడగటం మొదలుపెడుతుంది  . రిషీ బాగానే చెప్తాడు. ఫోన్ లో జగతి, వసూ చూస్తుంటారు. టీవీలో దేవయాని చూస్తూ తెగ సంబరపడుతుంది. ఇదంతా ఒక్కరితోనా సాధ్యమైందా అని జర్నలిస్ట్ అడిగితే..నేను సున్నా లాంటివాడిని నా ఎడమపక్కన అంకెలు చేరితేనే నాకు విలువ అని నేను నమ్ముతాను అంటూ కాలేజ్ స్టాఫ్ ని చూపిస్తాడు. వీళ్లే నా బలం అంటాడు. మీ లైఫ్ లో ఏదైనా లోటు మిగిలుందా అనే ప్రశ్నకు..ప్రతిమనిషి జీవితంలో అన్నీ పరిపూర్ణంగా ఉండవు. లోపాలు,ఆటుపోట్లు అన్నీ స్వీకరిస్తూ ముందుకుపోవటమే నా  పని అంటాడు. రిషీ ఇలా చాలా బాగా అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తూ ఉంటాడు. చివరిగా ఒక ప్రశ్న అని మిషన్ ఎడ్యుకేషన్ ఆలోచన మీకు వచ్చిందేనా అడి అడుగుతారు. రిషీకి సౌండ్ ఆఫ్. కాసేపు ఏం మాట్లడడు. ఆలోచిస్తాడు. నిజం చెప్పాలంటే నా ఆలోచన కాదు..నేను ఈ కార్యక్రమంలో ఒక కార్యకర్తను, ఈ ఆలోచన  మా ఫ్యాకెల్టీ హెడ్ జగతిమేడమ్ గారిది అంటాడు. అందరూ మోఖాలు వెలిగిపోతాయ్. ఈ సక్సస్ వెనుకు జగతి మేడమ్, మా స్టూడెంట్ వసుధార ఇంకా మా వాలంటీర్స్ అందరూ ఉన్నారు అంటాడు. దేవయాని కుళ్లుకుంటుంది. నమస్కారం చెప్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. ఇంటర్వూ ఎండ్ అయిపోతుంది.  ఇంట్లో దేవయాని ఛీ నేను అనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి, రిషీ అసలు ఏం మాట్లాడుతున్నాడు అంటూ అరుస్తుంది. ఇంతలో ధరణి వచ్చి అత్తయ్యగారు పిలిచారా అంటుంది. నీకు పిలిచినట్లు అనిపించిందా అంటూ ధరణి అంటూ సీరియస్ గా అడుగుతుంది. నువ్వు తెలివైనదానివో, తెలివితక్కువ దానివో నాకు అస్సలు అర్థంకాదు అంటుంది. ధరణి అత్తయ్యగారు కాఫీ తీసుకురానా, రెండు స్పూన్ల షుగర్ వేసి అంటుంది.  దేవయానికి పిచ్చిలేస్తది. నువ్వు వెళ్లు అని ధరణిని పంపస్తుంది.
ఇంకోసీన్ లో దేవయాని అన్నమాటలను, జగతి అన్న మాటలను తలుచుకుంటాడు. నేను గెలిచానా, గెలిపించబడ్డానా, ఈ గెలుపులో ఏమాత్రం నా వాటా ఉన్నా అదినాకు ఎందుకు ఆనందం ఇవ్వటం లేదు అనుకుని కారు ఎక్కి వెళ్తాడు. ఇక్కడ ఇంట్లో వసూ ఒక్కతే ఉంటుంది. అప్పుడే జగతి వస్తుంది. మేడమ్ ఏమైంది మీకు, ఎక్కడికి వెళ్లారు అంటుంది వసూ. నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్ అంటుంది జగతి. మేడమ్ నేను అడిగినదానికి సమాధానం చెప్పండి, ఎక్కడికి వెళ్లిపోయారు అంటుంది వసూ. ఏ నేను అడిగినదానికే నేను సమాధానం చెప్పాలా, నువ్వు చెప్పవా అంటుంది జగతి. అంతపెద్ద ఛానల్ ఇంటర్వూ మీరు ఉండాలికదా అంటుంది వసూ. ఏ నువ్వు ఉండాలికదా, అక్కడినుంచి వచ్చేశావా అని జగతి అంటుంది. అవును మేడమ్ మీరు లేకుంటే నేనెందుకు అక్కడ అంటుంది వసూ. జగతి వసూ నీకంటూ బాధ్యత ఉండాలికదా అంటుంది. మీరు కూడా ఆ బాధ్యతను ఫీల్ అవ్వాలికదా మేడమ్ అంటుంది వసూ. జగతికి కోపం వస్తుంది..వసూ మాటకు మాట చెప్పటం తెలివైన పనికాదు. అక్కడ రిషీ, మహేంద్రను వదిలేసి వచ్చేసి నాకోసం బాధపడుతున్నావా, నువ్వు ఉండాలికదా వసూ అంటుంది.
 వెనక నుంచి మీరు లేకపోతే మీ ప్రియమైన శిష్యూరాలు ఎలా ఉంటారు మేడమ్ అంటాడు రిషీ. బాగుంది మేడమ్ చాలాబాగుంది. మీరు సూపర్, మీ శిష్యూరాలు డబుల్ సూపర్, పైగా ఇక్కడికి వచ్చి నువ్వెందుకు లేవు అంటే నువ్వెందుకు లేవు అనుకుంటున్నారు అంటాడు. వసూ సార్ మీరు తప్పుగా అర్థంచేసుకుంటున్నారు అంటుంది. లేదు ఇప్పుడే కరెక్టుగా అర్థంచేసుకుంటున్నాను, హలో వసుధారగారు యూత్ ఐకాన్ గారు, మీరేంటో మళ్లీ కొత్తగా మాట్లాడుతున్నారు, ఇందాక నేను  నేను ఎక్కువ, మీ మేడమ్ గారు ఎక్కువ అంటే చాలా పద్ధతిగా, ఒకరకంగా సమాధానం చెప్పావ్ గా, నా పీఏగా ఏరికోరి ఎంచుకుంటే బాధ్యతలు మరిచి వచ్చేసింది, పైగా గొప్పగొప్ప కొటేషన్స్ చెప్తుంది మళ్లీ అంటూ దెప్పిపొడుస్దాడు రిషీ. వసూ సార్ అంటుంది. ఏం యూత్ఐకాన్ గారు..మళ్లీ సారీ చెప్తావా, లేక గొప్పగొప్ప కొటేషన్స్ చెప్తావా, జరిగిందాంట్లో అసలు నీ తప్పేంలేదని నన్ను నమ్మిస్తావా అంటాడు. జరిగిందానికి నేను బాధపడలేదు సార్, నేను రావాలానుకున్నాను వచ్చేశాను అంటుంది వసూ. ఇప్పటికినీలో వచ్చేసినందుకు బాధలేదా అంటాడు రిషీ. తర్వాత బాధపడే పనులు నేను చేయను సార్, అనేముందు చేసేముందు ఒకటికిపదిసార్లు ఆలోచిస్తాను అంటుంది వసూ. జగతి..వసూ ఎందుకిలా గొడవ పెంచుతున్నావ్ అంటుంది. గొడవేం లేదు మేడమ్ నా అభిప్రాయం అడిగారు చెప్తున్నాను అంటుంది. నేను వచ్చాను అంతే అంటుంది.
రిషీ  అవును మేడమ్ గొడవలేం ఉంటాయ్, ఎవరి నమ్మకాలు వారివి, ఎ‌వరి అభిప్రాయాలు వారివి,,నేనెందుకు వచ్చానో చెప్తాను వినండి. అని ఈ పేరు ఈ విజయం నాదికాదు, మీది. అవును నిజమే. మీ ఇద్దరి కృషి చాలా ఉన్నప్పుడు నా ఒక్కరిదే విజయం అని పొంగిపోయేవాడ్ని కాదు. ఈ పేరు ఈ విజయం మీదే. ఉచితంగా వచ్చేదాన్ని ఈ రిషేంద్రబూషన్ తీసుకోడు థ్యాంక్స్ ఇద్దరికి తీసుకోడు అని చెప్పి వెనుదిరుగుతాడు. అప్పుడే మహేంద్ర వచ్చి ఏ రిషీ నన్ను వదిలేసివచ్చావ్, కంగ్రాస్ట్స్ రిషీ, ఇంటర్వూచూస్తే పొంగిపోయాను తెలుసా అంటాడు. మీరింకా రాలేదేంటా అనుకున్నాను వచ్చేశారు అంటాడు రిషీ.  ఏంటి రిషీ, ఎందుకు వచ్చావ్, ఎందుకు వెళ్తున్నావ్ అంటాడు మహేంద్ర. డాడ్ మీకు అవసరం లేనిది, ఇష్టంలేనిది మీకు ‌ఎ‌వరైనా ఇస్తే ఏం చేస్తావ్ అంటాడు రిషీ. మహేంద్ర తిరిగి ఇచ్చేస్తాను అంటాడు. నేను అదే చేశాను అంటాడు రిషీ.
కట్ చేస్తే దేవయాని ఫణీంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా మనరిషీ గొప్పతనమే, రిషీ ఈరోజు సాధించాడు, తనేంటో అందరికి మొఖం మీద కొట్టినట్లు చెప్పాడు, ఎ‌వరూ లేకున్నా అవలీలగా ఎలా మాట్లాడాడు, మీరే నన్ను నమ్మరు అంటుంది. సారే దేవయాని అయినా రిషీ గొప్పతనం కొత్తగా నువ్వు నాకు చెప్పాలా అంటాడు ఫణీంద్ర. ఇన్నాళ్లు ఆ జగతి, వసుధారను నెత్తినపెట్టుకున్నారుగా..ఈరోజు వాళ్లు ఎవరూ లేకున్నా రిషీ ఎంతబాగా మాట్లాడాడు అంటాడు. ఎవరి గొప్పతనం వాళ్లది, అంతమాత్రానా జగతి, వసుధార గొప్పతనం పడిపోయినట్లా అంటాడు. ఇలా మాట్లాడుకుని ధరణిని పిలిచి..రిషీ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం స్వీట్ చేయ్ అందరికి పంచేయ్ అంటుంది. మళ్లీ వద్దులే స్వీట్ చేసేసరికి లేట్ అవుతుంది. బయటనుంచి తెప్పిస్తాను అంటుంది. ఇంతలో రిషీ  వస్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది.
తరువాయిభాగంలో వసూ రిషీకి సారి అని మేసేజ్ చేస్తుంది. బుక్ మీద సారీ సార్ అని రాసి ఫోటో పంపుతుంది. ఏంటి ఈ వసుధారకు ఏమైంది, చేసిదంతా చేసి సారీ చెప్తుందా..నీ సారీలకు కరగను అని మెసేజ్ పెడితే అనుకుని అసలు నేనెందుకు రెస్పాండ్ అవ్వాలి అనుకుంటాడు. చూద్దాం రేపు ఏం రిప్లైయ్ ఇస్తాడో.

Read more RELATED
Recommended to you

Latest news