బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ల భారీ స్కెచ్‌..ఢిల్లీ రెండు రోజుల పాటు కీలక చర్చలు !

-

దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ల మధ్య నేటి రెండు రోజుల పాటు సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో మౌలిక విధానపరమైన అంశాలపై చర్చ జరుగున్నట్లు సమాచారం అందుతోంది. బిజెపి జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్, బిజేపి కార్యనిర్వాహక సభ్యులు, కేంద్ర మంత్రులతో సహా బిజెపి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

విద్య, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ వంటి పలు రంగాలలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల నాయకులు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ తో సహా ఇతర రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాముఖ్యత నెలకొంది. గత నెలలో కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల పై నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లు సమావేశం కానుండడంతో విపక్షాలలో కాస్త ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news