గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కారులో వస్తున్న గౌతమ్ రోడ్డుమీద ఉన్న వసూని చూసి కారు ఆపుమంటాడు. ఆ అమ్మాయితో మాట్లాడొస్తా అని ఫుల్ ఉత్సాహంలో గౌతమ్ వసూ దగ్గరకు వెళ్తాడు. గౌతమ్ హాయ్ అండి అంటే..వసూ సింపుల్ గా హలో అంటుంది. మనోడు అందేంటండి సింపుల్ గా హలో అంటున్నారు నేను గౌతమ్ గుర్తుపట్టలేదా అంటాడు. వీళ్లను దూరం నుంచి చూస్తున్న రిషీ వీడు చెప్పిన అమ్మాయి వసుధారనా అనుకుంటాడు. వసూ గుర్తుపట్టాను అండి అందుకేకదా హలో అన్నాను అంటుంది. అంటే మిమ్మల్ని చూడగానే..నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎక్సైట్ అయ్యాను మీరు అలా ఏం కాలేదని అంటాడు గౌతమ్. ఏం అవ్వాలి అండి..అయినా మీరు నన్ను చూసి ఎందుకు ఎక్సైట్ అవ్వాలి, ఒకసారి కలిశాం అయిపోయిందికదా అంటుంది వసూ. కానీ నేను మీరు మళ్లీ కలిస్తే బాగుండు అనుకున్నాను..ఇప్పుడే అలా అనుకన్నాను..ఇలా కనిపించారు అంటాడు గౌతమ్.వసూ ఓ గుడ్ అండి, మీరు గ్రేట్ అండి అయితే..ప్రపంచంలో అందరూ బాగుండాలి అని కోరుకోండి అది జరిగిపోతుంది అంటుంది. గౌతమ్ హా అంటాడు.వసూ ఆటోకోసం చూస్తూ ఉంటుంది. గౌతమ్ మీరు ఎటో వెళ్తున్నట్లు ఉన్నారు..లిఫ్ట్ ఇస్తాను పదండి అంటాడు. మీ లిఫ్ట్ నాకు అవసరంలేదండి అంటుంది వసూ. అది నా కారు కూడా కాదు..నా ఫ్రెండ్ కారు అని రిషీని చూపిస్తాడు.
వసూ అప్పేడే రిషీని చూస్తుంది. రిషీ వీడెంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడు..అయినా వసుధారకు ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనుకుంటాడు. వసూ వెళ్దాం ఏం మాట్లాడతాడో చూద్దాం..ఫ్రెండ్ ముందు కూడా దేవయాని మేడమ్ విషయంలో కోపంగానే ఉంటారోలేదో చూద్దాం అని వెళ్తుంది. గౌతమ్ రిషీని ఎలాగోలా ఒప్పించి కారు ఎక్కిస్తాడు. వసూ వెనుకసీట్ లో కుర్చోడంతో రిషీ మిర్రర్ లో చూద్దాం అనుకుంటాడు. వసూ కావాలనే పక్కకు జరిగి కుర్చుంటుంది. రిషీ మనసులో వాడు రమ్మనగానే రావాలా, రాను అనొచ్చుగా అనుకుంటాడు. గౌతమ్ రిషీతో నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా, గ్రేట్ కదా అంటాడు.మహా గ్రేట్ అంటాడు రిషీ. గౌతమ్ రిషీని పరిచయం చేస్తాడు. మీ పేరేంటో తెలుసుకోవచ్చా అంటే..రిషీ వసుధార అనేస్తాడు. తన పేరు మీకెలా తెలుసురా అంటే..వసూ నేను సార్ వాళ్ల కాలేజ్ లో చదువుతున్నాను అంటుంది. గౌతమ్ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. కాలేజ్ పెట్టి మంచిపనిచేశావు అంటాడు. గౌతమ్ వసుధార అనేసి..ఈ అండి, గారు, మేడమ్ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయని నా అభిప్రాయం సో వసుధార అనే పిలుస్తాను మీకు ఓకేనా అంటాడు. రిషీ మనసులో వద్దని చెప్పు, వసుధార వద్దని చెప్పు అనుకుని మిర్రర్ లో వసూని చూస్తాడు. వసుధార కావాలనే ఓకే అండి..మనుషుల మధ్య మీరు చెప్పిన పిలుపులే కాదు, కోపాలు, అలకలు ఇవి కూడా దూరాన్ని పెంచుతాయి అంటుంది. గౌతమ్ అవనవును ఉంటారులేండి..కొంతమంది వెదవలు, అపార్థాలు చేసుకుంటారు, అలుగుతారు, అంతెందుకు వీడుకూడా చిన్నప్పుడు ప్రతిదానికి అలిగేవాడు అని రిషీ గురించి చెప్తాడు.
వసుధార నేను చాలా స్ట్రైట్ ఫార్వాడ్ మనిషిని..మనసులు ఏది ఉంటే అదే మాట బయటకొస్తుంది అంటాడు గౌతమ్. వసూ గుడ్ అండి ఇదే మంచి పద్దతి, నాకు తెలిసిన కొందరు ఉన్నారు, మనసులో ఏది ఉన్నా అడగరు, వాళ్లు మళ్లీ ఏదేదో ఊహించి ఫీల్ అవుతూ ఉంటారు. వసూ రిషీ గురించే అనేది. రిషీకి కాల్తా ఉంటుంది. గౌతమ్ అదొక వేస్ట్ పద్ధతి అండి..మనసులో ఉంటే చెప్పేయాలి అని..ఉదాహరణకు..ఆరోజు మనం కలిశాం కదా..మళ్లీ ఎప్పుడు కలుస్తారా అని చాలా వెయిట్ చేశాను, అందులోను మీరు నా రిషీ కాలేజ్ అంటాడు. రిషీ కోపంతో బ్రేక్ వేస్తాడు. వసూ గౌతమ్ కు తగిలింది. గౌతమ్ ఇదేదో బాగుందిరా..ఇలానే ట్రై చేయరా అంటాడు. అలా స్టడీ గురించి టాపిక్ తీస్తాడు. మీకు మ్యాక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు అంటాడు. రిషీ తను కాలేజ్ టాపర్, యూత్ ఐకాన్ టైటిల్ విన్నర్ అంటాడు. అయితే నా సెలక్షన్ సూపర్ అనమాట అనుకుని..వసుధార మీ హాబీస్ ఏంటి, ఫుడ్ ఏంటి, పెట్ ఏంటి..పిల్లి, కుక్క అంటూ వసూతో మాట్లాడుతూ ఉంటాడు. రిషీ ఏంట్రా నీ గోలా ఆపుతావా అంటాడు. ఆపుతాను అంటాడు గౌతమ్, అయినా నేను మరిపోయాను కదా, ఇలాంటివి అన్నీ నిన్నే అడిగితెలుసుకోవచ్చుకదా అంటాడు గౌతమ్. నా స్టూడెంట్స్ గురించి నాకు తెలియకుండా ఉంటుందా అంటాడు రిషీ. అవునులే..నా అంత కాకపోయినా నువ్వు తెలివైన వాడివేకదా అంటాడు గౌతమ్..రిషీ కారు ఆపి…రేయ్ వింటున్నాను కదా అని నోటికివచ్చిన అబద్ధాలు చెప్పకు అంటాడు. గౌతమ్ ప్లిజ్ ప్లిజ్ రా…కొంచెం సేపు మేనేజ్ చేయ్ రా అంటాడు. కారు తీయ్ రా అంటే..తన రెస్టారెంట్ వచ్చింది అంటాడు రిషీ.
అందరూ కారు దిగుతారు..గౌతమ్ ఏంట్రా తనకు రెస్టారెంట్ ఉందా అంటే..కాదండి నేను ఈ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను అంటుంది వసూ. గౌతమ్ మళ్లీ వావ్ సూపర్ అండి మీరు, పనియే దైవం అనమాట అంటాడు. కాఫీ తాగి వెళ్దాం పద రిషీ అంటే నాకు కాఫీ నచ్చుదు అంటాడు రిషీ. గౌతమ్ నీకు కాఫీ ఇష్టమేకదరా అంటే..ఏ ఇష్టాలు మారొద్దా అంటాడు. గౌతమ్ సరే నేను వెళ్లి కాఫీ తాగొస్తాను..నువ్వెళ్లి ఓ అరగంట రౌండ్ కొట్టేసిరా అంటాడు. కొట్టేది రౌండ్ కాదు..నిన్ను..నా పంచ్ పవర్ తెలుసుకదా..వెళ్లి కారులో కుర్చో అంటాడు రిషీ. గౌతమ్ రేయ్ రేయ్ మంచి అవకాశం రా ప్లీజ్ రా అని బతిమిలాడతాడు. రిషీ ఒప్పుకోడు. గౌతమ్ వసుధార మనం మళ్లీ కలుద్దాం బాయ్ అని నమస్కారం పెడతాడు. వసూ రిషీకి బాయ్ సార్ అని షేకాండ్ ఇవ్వబోతుంది. గౌతమ్ తనకేమో అనుకుని..ఆరోజు హాస్పటల్ లో షేకాండ్ ఇస్తే తీసుకోలేదుకదా..అంతలోనే ఇంత మార్పా అనుకుంటాడు. వసూ థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అంటే..మనకి మనకీ ఫార్మాలిటీస్ వద్దులే అంటాడు గౌతమ్. హలో కారు నాదు అంటాడు రిషీ. లిఫ్ట్ ఇచ్చింది, పిలిచింది ఆ సార్ హే కదా అంటుంది వసూ. వసూ వెళ్తుంది. గౌతమ్ చూస్తూనే ఉంటాడు. రిషీ వెళ్దామా అంటే..గౌతమ్ వసుధార సూపర్ కదరా అంటాడు. నువ్వు కారు ఎక్కరా ముందు అంటే..సరే అని వసుధార ఇక్కడే పనిచేస్తుంది అని నీకు ఎలా తెలుసు సరిగ్గా కారు ఇక్కడే ఎందుకు ఆపావ్ అంటాడు గౌతమ్. తను మా స్టూడెంట్ హే కదరా అంటాడు రిషీ.
ఇంకోసీన్ లో జగతి, మహేంద్రలో ఇంట్లో ఉంటారు.రెస్టారెంట్ లో జరిగింది ఆలోచిస్తూ ఉంటారు. రిషీ అపార్థం చేసుకున్నాడు..వీలైనంత త్వరగా రిషీకి నిజం తెలిసేలా చేయవా అంటుంది జగతి. ట్రై చేస్తాను జగతి అంటాడు మహేంద్ర. కనీసం ఈ విషయంలో అయినా సీరియస్ గా తీసుకోవా అని జగతి అనటంతో..అదేంటి జగతి అలా అంటావ్..నేను అన్ని విషయాలు సీరియస్ గా తీసుకుంటాను కదా అంటాడు. శిరీష్ విషయంలో రిషీ అపార్థం చేసుకుంటే..అది ఎంతదాకా దారితీసిందో తెలుసుకదా..మళ్లీ అలాంటి సంఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే..జరిగిన నిజాన్ని రిషీకి చెప్పాలి అంటుంది జగతి. కనీసం ప్రయత్నం అయినా చేయి మహేంద్ర అనటంతో..జగతీ ప్లీజ్ అన్నిసార్లు చెప్పకు..అంటాడు మహేంద్ర. నేను, వసూ చేయని తప్పుకు నింద మోస్తున్నాం అని మాట్లాడుతుంది.
మరోపక్క ధరణి..రిషీ కోపంగా ఉన్నాడేంటి..వసుధారను అడిగితే తెలుస్తుందిగా అనుకుని వసూకి కాల్ చేస్తుంది. వసూ ధరణీ ఫోన్ రావడంతో..రిషీ సార్ అనుకున్నానే అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో ధరణీ ఫోన్ మాట్లాడుతుంటే..రిషీ వస్తాడు. ధరణీ ఫోన్ పక్కనేస్తుంది. రిషీ ధరణి ఫోన్ లో వసూ లైన్ లో ఉందని చూసి కావాలనే..వదినా పెద్దమ్మకు గాయం ఎలా అయిందో తెలుసుకదా..అయినా ఆ వసుధార సారీ చెప్పలేదు..కిరీటం పడిపోతుందా, గర్వమా, అహంకారామా, పొగరా అంటాడు. ఈ మాటలన్నీ వసూ వింటుంది..నా తప్పు లేనప్పుడు నేను సారీ చెప్పేదే లేదు అనుకుంటుంది.