గుప్పెండంతమనసు ఎపిసోడ్ 331: రిషీ చెప్పిన పనిలో తను ఏం చేయబోతుందో క్లారిటీగా చెప్పిన జగతి..ఇక్కడ గౌతమ్ ప్రేమకు అడుగడుగునా రిషీ బ్రేక్స్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసు డల్ గా బయటనిల్చుంటే రిషి-గౌతమ్ అక్కడకు వస్తారు. గౌతమ్ వసుధారతో అదేపనిగా మాట్లాడతాడు. చెప్పకుండా వచ్చామని ఏం అనుకోవద్దు. ముందు ముందు ఇంకా చాలా సప్రైజ్ లు ఉంటాయే లే అని..ఏంటి అలా ఉన్నారు..పొద్దున్న డల్ గా ఉంటే..ఆరోజు అంతా అలానే ఉంటుంది..అని ఇంట్లోకి పిలవ్వా, మర్యాదలు ఇలాంటివి ఏవి ఉండవా అని అడుగుతాడు. వసూ రండి సార్..నేను కాలేజ్ కి వెళ్లే తొందరలో ఉన్నాను అంటుంది. వద్దులే వసుధఘార అంటాడు అంటాడు రిషి. గౌతమ్ మాత్రం వసుధార అంత అభిమానంగా పిలుస్తుంటే..వెళ్లకపోతే ఏం బాగుంటుంది అని..ముగ్గురు లోపలికి వెళ్తారు.

గౌతమ్..ఇంతకీ ఎందుకు వచ్చినట్లురా నువ్వు అని అడుగుతాడు. రిషీ మనసులో నువ్వు నన్ను లాక్కొచ్చి…ఇక్కడ ఇరికిస్తున్నావా అనుకుని..మిషన్ ఎడ్యుకేషన్ టాపిక్ తీస్తాడు. మేడం నేను చెప్పిన పని మొదలెట్టిందో లేదో తెలియాలంటే ఇన్ డైరెక్ట్ గా అడగాలని అనుకుంటాడు. డల్ గా ఉన్నావేంటి అంటే..అలా ఏం లేదు అంటుంది వసూ.. బయట కారు లేదు మేడం ఇంట్లో లేరా అన్న రిషితో .. మేడం కాలేజీకి వెళ్లారని చెబుతుంది వసూ. మరి నువ్వెలా వస్తావని అడిగితే..నేను ఈ సౌకర్యాలకు, కార్లకు అలవాటు పడలేదు..ఆటోలను మర్చిపోలేదు సార్ అంటుంది. గౌతమ్ మా కారులో వెళ్దాం రండి అంటుంది. రిషీ కూడా రమ్మంటాడు. వసు తప్పక వెళ్తుంది. రిషీ.. వసుని హాస్టల్ పంపించే పని ఎంతవరకూ వచ్చిందని మేడంని ఎలా అడగాలని రిషీ ఆలోచిస్తాడు. గౌతమ్ వాటర్ అడగితే..రిషీ లేవంటాడు. వసుధార ఇస్తా అంటే..వద్దంటాడు. పోనీ కొబ్బరిబోండాలు తాగుదామా అంటాడు..గౌతమ్..పొద్దున్నే కొబ్బరిబోండాలు ఏంట్రా అంటాడు రిషీ..

ఇలా చిన్నప్పటి విషయాలు రిషి ఏమైనా చెప్పాడా అంటూ గౌతమ్ వసూతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. రిషీ ఆపడాని చూస్తాడు. రిషి ఏం చేసినా నాకు చెప్పకుండా చేసేవాడు, నేను మాత్రం చెప్పే చేసేవాడిని అని.. వసుధార నీ గురించి చెప్పు..మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటాడు. రిషీ నోరు మూసుకో అంటాడు. గౌతమ్..ఏంట్రా నువ్వు, నీళ్లు అడిగాను వద్దన్నావు, బొండాలు అన్నాను వద్దన్నావు..ఏదో ఘోరం జరిగినట్లు సైలెంట్ గా కుర్చోవాలా అంటాడు. రిషీ కారు ఆపి దిగరా అంటాడు. గౌతమ్ జోక్ చేస్తున్నావ్ కదరా అంటాడు. రిషీ మళ్లీ సీరయస్ గా దిగమని చెప్పానా అంటాడు. గౌతమ్ ఇలా మధ్యలో దింపేస్తే నే ను ఏం కావాలిరా అంటే..మధ్యలో ఎలా దింపేస్తారా..క్యాబ్ బుక్ చేశాను వెనుక ఉంది వెళ్లు అంటాడు. గౌతమ్ పాపం ఎంత బతిమిలాడినా..రిషీ మాత్రం తగ్గడు. ఇంటికి వెళ్లి బొమ్మలు గీసుకో అంటాడు. వసూ మీరు బొమ్మలు గీస్తారా అంటే..ఆ అన్నీ నీ బొమ్మలు గీసి..నీకే ఇస్తాడులే కానీ..నువ్వు ముందుకు రా అంటాడు. కారు దిగి.. ఏ ఒక్క అవకాశం దొరకనివ్వడం లేదని అనుకుని క్యాబ్ ఎక్కుతాడు.

కాలేజీలో

కాలేజీలో తన క్యాబిన్లో కూర్చున్న జగతి.. రిషి చెప్పిన మాటలు-తాను వసుధారని అన్నమాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది. ఇంతలో మహేంద్ర వచ్చి..జగతి నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి, మాట్లాడం కాదు..ఒక విషయాన్ని క్యారిఫై చేసుకోవాలి అంటాడు. నా మూడ్ బాలేదంటుంది జగతి. మీ మూడ్ ని నేను రిపేర్ చేస్తాకదా అంటాడు. జగతి లేచి..నా మూడ్ బాలేదని చెప్పాను కదా అంటుంది. మహేంద్ర ఒకసారి కుర్చో అంటాడు. జగతి నాకు ఆకలేస్తుంది..క్యాంటీన్ కి వెళ్లొస్తాను..అక్కడికి వచ్చి కంపెనీ ఇస్తాను అనకు అని వెళ్లిపోతుంది. బయటకు వచ్చిన జగతికి వసుధార ఎదురవుతుంది. జగతి మనసులో సారీ వసు అని అనుకుంటుంది. వసూ మేడమ్ ఎక్కడికి వెళ్తాన్నారు అంటే జగతి తర్వాత మాట్లాడతాను అని వెళ్లిపోతుంది. వసూ మేడమ్ కి ఏమైంది..ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుని ముందుకు వెళ్తుంది. ఇంతలో మహేంద్ర ఎదురుపడడంతో మేడంకి ఏమైందని అడుగుతుంది వసుధార. టిఫిన్ తినలేదు, లంచ్ తెచ్చుకోలేదట..ఆకలేస్తుందని క్యాంటిన్ కు వెళ్తా అనింది అంటాడు. వసూ మేడమ్ లంచ్ బాక్స్ తీసుకురాకపోవడమేంటి..అసలేంటి, ఏమైంది మేడమ్ కి అని వసూ తనలో తనే మదన పడుతుంది.

రిషీ క్యాబిన్

క్యాబిన్లో కూర్చున్న రిషి.. వసుని హాస్టల్ కి పంపించేయమన్న విషయం గుర్తుచేసుకుని..ఎంతవరకూ వచ్చిందో అని అనుకుని.. జగతి మేడంని రమ్మని పిలుస్తాడు. జగతి మేడం నీడలో వసుధార మంచితనం మసకబారిపోతోంది. ముఖ్యంగా పెద్దమ్మ దగ్గర. అందుకే వసుకి సంబంధించి మంచి నిర్ణయమే తీసుకున్నా అని తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు. జగతి వస్తుంది. మీకొక పనిచేశాను..ఆ వివరాలు నాకేం అప్డేట్ చేయాలేదు అని.. వసుధార గురించి నేను చెప్పింది ఏం చేశారు అని అడుగుతాడు. జగతి ఏదో చెప్పబోతుంది..మీరేం సంజాయిజీ చెప్పనవసం లేదు..మీరు ఆపని పూర్తిచేస్తున్నారు అని..వసుధారను హాస్టల్ లో అడ్మిట్ చేసే ఫామ్ ఇస్తాడు.

జగతి సీరియస్ గా లేచి..అక్కర్లేదు సార్..వసుధారనే మీ దగ్గరకు వచ్చి అడుగుతుంది..ఇందుకోసమే అయితే..నేను వెళ్తాను..మీరు చెప్పిన పని త్వరలోనే అయిపోతుంది అంటుంది. ఇంతలో వసుధార వస్తుంది. మీకోసమే వచ్చాను..షార్ట్ ఫిల్మ్ స్టోరీ బోర్డు గురించి ఏమైనా సందేహాలు వస్తే అడుగుతాను అంటుంది వసు. నేను ఏం చేసినా కరెక్టుగానే చేస్తాను..పని చెప్పే వారికి సందేహాలుంటే అది వాళ్ల ప్రాబ్లెం..కానీ నేను మాత్రం పని పూర్తిచేయడంపైనే ఉంటానని రిషిని ఉద్దేశించి చెప్పేసి వెళ్లిపోతుంది. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

తరువాయిభాగంలో

రెస్టారెంట్ కి వెళ్లి కాఫీ తాగిన గౌతమ్..సెల్ఫీ తీసుకుని అది కాస్తా.. స్టేటస్ లో పెడతాడు. అది చూసిన రిషి వీడు ఎక్కడ ఉన్నాడో అనుకుంటాడు. ఇంటికే కదా వెళ్లేది నేను కూడా ఆటోలో వస్తా అని వసుని అడుగుతాడు గౌతమ్. వసూ వద్దంటుంది. గౌతమ్ వస్తా అంటాడు. ఇంతలో నేను కూడా వస్తానంటూ అక్కడకు ఎంట్రీ ఇస్తాడు మన ఇగో మాష్టర్.

-triveni

Read more RELATED
Recommended to you

Latest news