కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేయటం హేయమైన చర్య అని బిజేపి ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు అని అన్నారు. ఈ చర్యకు ప్రోత్సాహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా మున్సిపల్ అధికారులు ప్రమేయం ఉంటే వారిని సర్వీస్ నుంచి తొలగించాలని అన్నారు.
రాజకీయ ప్రమేయం ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలన్న ఆయన బ్యాంకుల ముందు చెత్త వేయటం చెత్త పని అన్నారు. రాష్ట్రం లో ఈ సంస్కృతి ఏంటో అర్దం కావడం లేదని ఆయన అన్నారు. గతంలో ఓ నేత కేంద్ర ప్రభుత్వ వాహనాలు రాష్ట్రం లోకి రానివ్వను అన్నారు. ఇప్పడు నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పని చేయానివ్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని జీవీఎల్ అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన పేర్కొన్నారు.