టీ కాంగ్రెస్ లో సీనియర్ల భుజాన తుపాకీ పెట్టి… జూనియర్లు పని కానిచ్చేస్తున్నారా

-

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పంచాయతీలో ఒక్కొక్కరిది ఓక్కో లెక్క. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మాకేం ఇబ్బంది లేదనుకునే వారున్నారు. పదవి కావాలి కానీ మనం బయట పడుకుండా ఉండాలనే ఆశావాహులు ఉన్నారు. బయట పడరు కానీ..తన కోసం ఎవరో ఒకరు మాట్లాడాలనుకునే వారు ఉన్నారు. ఠాగూర్ అభిప్రాయ సేకరణ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారాలన్నింటిని చూసే ఏ ఒక్కరికైనా ఇదే అనిపిస్తోంది. సీనియర్ల మనసులో ఉన్నది..జూనియర్లకు అక్కరకు వస్తుందో..లేదంటే మేం మాట్లాడలేం కాబట్టి..బయట సినియర్లతో మాట్లాడించటమే బెటర్ అనుకున్నారో కానీ పీసీసీ ఆశావాహులు మాత్రం సైలెంట్ గా ఉంటు..సీనియర్లతో నోరు విప్పేలా చేస్తున్నారు.

పని అయ్యిందంటే నేను ఏం మాట్లాడకుండానే పని జరిగిపోయిందని..పని కాలేదంటే నేను ఎక్కడా పదవి ఆశించలేదు బయట కూడా నేను ఏం మాట్లాడలేదు కదా.. అని తప్పించుకోవటానికి మార్గాలు ఎంచుకుంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఇలాంటి వారంతా. భోలాగా మాట్లాడే వారిని పావులుగా మార్చుకుంటున్నారనే టాక్ ఇప్పుడు పార్టీలో చర్చనీయంశంగా మారింది. వీరు మాట్లాడేది నిజమే కావచ్చు. కానీ తన కోసం కాకుండా ఇతరుల కోసం ఎందుకు మాట్లాడటం అనే టాక్ కూడా నడుస్తోంది. పీసీసీ ఆశిస్తున్న చాలా మంది..సీనియర్ల భుజాన తుపాకీ పెట్టి..కాల్చే పనిలో పడ్డారు. దీని నుంచి ఓ నాయకుడు బయట పడ్డా మరో నాయకుడు మాత్రం నోటికి పని చెప్తునే ఉన్నారు.

పీసీసీ రేసులో ఉన్నవారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారు. ఠాగూర్ వద్ద అదే చెప్పారు..బయట కూడా నాకు పీసీసీ అవకాశం ఇవ్వండి అని అడిగా అని కామెంట్స్ చేస్తు వచ్చారు. తత్వం భోద పడిన తరువాత..ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మాట్లాడటం కంటే ప్రయత్నాలు చేసుకోవడం ఉత్తమం అని నిర్ణయానికి వచ్చారు. ఇక పీసీసీ రేసులో ఉన్నవారిలో సీల్సీ నేత భట్టి విక్రమార్క..మాజీ మంత్రి శ్రీధర్ బాబు..మాజీ ఎంపీ మధుయష్కీలు ఉన్నారు. పీసీసీ రేసులో మేం ఉన్నామని ఇప్పటి వరకు వీరు బయటకు ప్రకటించుకోలేదు. కానీ పీసీసీ రేసులో మాత్రం సీరియస్ గానే ఉన్నారు.

సీఎల్పీ లో జరిగిన సమావేశంలో కూడా రేవంత్ కి తప్పితే..ఎవరికి పదవి ఇచ్చినా ఇబ్బంది లేదంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్ చేశారు. ఈ అభిప్రాయం ఆయనదే అయినా..మిగిలిన నాయకులు ఎవరూ మాట్టాడకుండా జగ్గారెడ్డిని ముందుండి మాట్లాడించేశారు. బయటకు మాత్రం జగ్గారెడ్డి ఒక్కడే వ్యతిరేకిస్తున్నట్టు కనపడింది. సమావేశంలో ఉన్నవారు ఎవరు మాట్లాడినా..ఎక్కడ బయట పడిపోతామో అని టెన్షన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి వర్గానికి మాత్రం జగ్గారెడ్డి ఒక్కరే వ్యతిరేకిస్తున్నారు అని కనిపించినా… వెనక ఉండి జగ్గారెడ్డితో మాట్టాడిస్తున్నారనే టాక్ అందరికి తెలిసిందే.

జగ్గారెడ్డి ఇప్పుడు పీసీసీ విషయంలో అంతగా మాట్లాడటం మానేశారు. నా అభిప్రాయం నేరుగా పార్టీకి చెప్పశాను.. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా నచ్చితే కలిసి పనిచేస్తా..లేదంటే సైలెంట్ గా ఉంటా అని డిసైడ్ అయ్యారు. అంతెందుకు మీడియాతోనే కాదు.. ఠాగూర్ కి అభిప్రాయం చెప్పిన తరువాత గాంధీ భవన్ లో ఎదురుపడ్డ రేవంత్ కి నేరుగానే జగ్గారెడ్డి చెప్పేశారట. ఎవరికి ఇవ్వాలో చెప్పా…ఎవరికి ఇవ్వద్దో కూడా చెప్పా..రేవంత్ నీకు పీసీసీ ఇవ్వద్దని చెప్పినా అనేశారట. దీనికి రేవంత్ స్పందిస్తూ నీలాగా ఉండే వారంటేనే ఇష్టం జగ్గన్నా అని అనేశారట. ఇద్దరికి క్లారిటీ ఉంది.

పీసీసీ రేసులో ఉన్న భట్టి విక్రమార్క..శ్రీధర్ బాబు..మధుయాష్కీ లాంటి వాళ్లు సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమ గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు హన్మంతరావు మాత్రం బీసీలకు ఇవ్వండి.. అని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు అవకాశం ఇవ్వాల్సి వస్తే మధుయాష్కీ గౌడ్ ఉన్నారుగా అనుకుంటారు. ఇక రెడ్డీయేతరులు అంటే శ్రీధర్ బాబు పేరు పరిశీలకు వస్తుంది..దళితులకు ఇవ్వాల్సి వస్తే భట్టి రేసులో ఉంటారు. ఇలాంటి కామెంట్లన్నీ పార్టీ సీనియర్ నాయుకుడు హన్మంతరావు లాంటి వారితో మాట్లాడించేస్తున్నారని పార్టీ భావిస్తోంది.

సీనియర్ లతో మాట్లాడించి రాజకీయం నడిపిస్తున్నారా..లేదంటే బయట పడి అథిష్టానం కు దూరం అవ్వటమెందుకు అనుకుంటున్నారో కానీ..మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో జూనియర్లు చాక చక్యంగా పావులు కదుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news