ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్ అయ్యారు. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్‌కు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు జీవీఎల్.
తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోరని.. అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటు అని ఆగ్రహించారు.
పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులు వేశారని.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికోసం నీళ్లను సముద్రంపాలు చేశారని గుర్తు చేశారు జీవీఎల్. ఇలాంటి చర్యలతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు ఎంపీ జీవీఎల్.