భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి రెండో వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యాలయా ల్లో నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉత్తర ప్రదేశ్ లో వర్ధంతి సందర్భంగా బిజెపి నేతలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఇద్దరూ కూడా నివాళి అర్పించారు.
ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అటల్ జీకి నివాళి అర్పించారు. ఇక ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్వాలియర్- చంబల్ ఎక్స్‌ప్రెస్ వే కు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చంబల్ ప్రోగ్రెస్ వే అని పేరు పెట్టనున్నామని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ప్రజల కోసం పనిచేయడానికి ఆయన మనలను ప్రేరేపిస్తూనే ఉన్నారని సిఎం వెల్లడించారు.