జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ స్వరాజ్యంపై జగన్ మాట్లాడడం హాస్యస్పాదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు గ్రామ వాలంటీర్లుగా సొంత పార్టీ వాళ్లను నియమించడం గ్రామ స్వరాజ్యమా అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం గ్రామ స్వరాజ్యమా అంటూ నిలదీశారు.
కరోనా నిధులు రూ.8,000 కోట్లు మళ్లించడం గ్రామ స్వరాజ్యమా? అని ఆయన విమర్శించారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన దాంట్లో మూడో వంతు కూడా గ్రామీణాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన వెల్లడించారు. అంతేకాక 14 నెలల పాలనలో ప్రజల స్వేచ్ఛను హరించారని యనమల రామకృష్ణుడు తెలిపారు. అంతేకాకుండా 600కు పైగా పోస్టులు సొంత సామాజిక వర్గానికే కేటాయించారని ఆయన ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు. తప్పుడు కేసులు పెట్టి, నామినేషన్లు విత్ డ్రా చేయించడమా గ్రామస్వరాజ్యం?’’ అని ప్రశ్నించారు.