జేబు దొంగతో పోల్చుతూ ధోనీపై ప్రశంసలు

-

టీమ్​ఇండియా మాజీ సారథి, వికెట్​ కీపర్ మహేంద్రసింగ్​ ధోనీ.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ విషయమై స్పందించిన టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి.. మహీ గొప్పతనం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. జేబుదొంగతనాలు చేసే వారి కన్నా ధోనీ పరుగెడతాడని ప్రశంసించాడు. అన్ని ఫార్మాట్లలోనూ చెరగని ముద్రవేసి, క్రికెట్​ రూపురేఖల్ని మార్చేశాడని అన్నాడు. తన ప్రశాంత స్వభావమే మహీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని చెప్పాడు.గతేడాది వన్డే ప్రపంచకప్​ న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చివరగా కనిపించిన ధోనీ.. అనంతరం ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అనేక ఊహాగానాల మధ్య ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

dhoni
dhoni

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ కూడా ధోనీపై ప్రశంసలు కురిపించాడు. క్రికెట్​ చరిత్రలోనే ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహీ ఒకడని అన్నాడు. అతడికంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని, బలమైన జట్టును రూపొందించే సామర్థ్యం ఉన్న నాయకుడని ప్రశంసించాడు. జాతీయ జట్టులో మిస్​ అయినప్పటికీ ఐపీఎల్​లో తమతోనే ఉంటాడని అన్నాడు. సెప్టెంబరు 19ను ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లో కలుద్దాం మహీ అంటూ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news