హ‌మారా స‌ఫ‌ర్ : కొత్త పార్టీ ! కొత్త హామీ !

-

దేశ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని ప‌రిత‌పిస్తున్నారు కేసీఆర్.ఇందులో భాగంగానే త‌న స‌త్తా చాటేందుకు కొత్త పార్టీ ఒక‌టి జాతీయ స్థాయిలో ఆరంభించాల‌ని చూస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర స‌మితి వ్య‌వ‌హారాలు ఇక‌పై హ‌రీశ్ మ‌రియు కేటీఆర్ చూడ‌నున్నారు. కేసీఆర్ మాత్రం ఢిల్లీ గ‌ల్లీల‌లో పాలిటిక్స్ చేయ‌నున్నారు.ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి కొన్ని ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిగేయి. త‌న పాత మిత్రుడు, తెలుగుదేశఃం పార్టీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు దూరంగా ఉంటూనే కొంత రాజకీయం న‌డపాల‌ని  కూడా అనుకుంటున్నారు కేసీఆర్.ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ తోనూ, అవ‌స‌రం అయితే స్టాలిన్ తోనూ ఇంకా వీలుంటే ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తోనూ రాజ‌కీయం స‌ఖ్య‌త‌తో కూడిన విధంగానే న‌డిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక కొత్త పార్టీ వ‌స్తే ఆంధ్రా రాజ‌కీయాలు ఏమ‌యినా మారుతాయా? అంటే త‌ప్ప‌కుండా మారుతాయి.జ‌గ‌న్ హ‌వాకు చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేయొచ్చు.లేదా చంద్ర‌బాబును నిలువ‌రించేందుకు కేసీఆర్ త‌న స‌త్తా చాటొచ్చు.ఏదో ఒక విధంగా ఓట్లు అయితే చీలిపోయి తెలుగుదేశం పార్టీ విజ‌యావ‌కాశాలు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు అయితే షురూ కాబోతున్నాయి. ఆంధ్రాలో జ‌గ‌న్ పార్టీతో పొత్తు ఉన్నా,లేక‌పోయినా ముందున్న కాలంలో జ‌గ‌న్ మ‌రియు కేసీఆర్ క‌లిసే ప్ర‌యాణిస్తారు.

ఇక మోడీ హ‌వాకు కేసీఆర్ చెక్ పెట్ట‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని ఎందుకంటే ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ ద‌గ్గ‌ర కేసీఆర్ పెద్ద‌గా రాణించ‌లేరు.గ‌తంలో కూడా ఇలాంటి ప్ర‌య‌త్నాలే చేసి స‌ఫ‌లీకృతం కాక వెన‌క్కుత‌గ్గారు. త‌రువాత దేశ రాజ‌కీయాల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి వ్య‌వ‌హారాలు చూసేందుకు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కే కేశ‌వ‌రావుకు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించి కేసీఆర్ త‌ప్పుకున్నారు.2014 -19లో క‌విత నేతృత్వంలో ఢిల్లీ రాజ‌కీయాలు న‌డిచాయి కానీ అవేవీ వేగ‌వంతంగా సాగ‌లేదు.

దాంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆశించిన విధంగా ఢిల్లీలో ప్ర‌గ‌తి సాధించ‌లేక‌పోయింది అన్న‌ది ఓ వాద‌న. 2009 నుంచి 2014 వ‌ర‌కూ ఆమె ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్నారు. అటుపై రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం నిజామాబాద్ ఎంపీ అయ్యారు. ప్ర‌స్తుతం ఆమె ఎమ్మెల్సీగానే మిగిలిపోయారు.మొన్న‌టి ఎన్నిక‌ల్లో పసుపు బోర్డు ఏర్పాటే ల‌క్ష్యంగా బీజేపీ రాజ‌కీయాలు చేయ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో అర‌వింద్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు.క‌నుక దేశ రాజ‌కీయాల్లో క‌విత, అదేవిధంగా ఆమె తండ్రి కేసీఆర్ ఇద్ద‌రూ కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో కాస్తో కూస్తో కేకే త‌న‌దైన వాయిస్ అయితే వినిపిస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జాతీయ పార్టీ పెడితే కేసీఆర్  ఏ విధంగా రాణిస్తారో అన్న‌దే ఆస‌క్తిక‌రం.

Read more RELATED
Recommended to you

Latest news