‘కేసీఆర్’ ఊసరవెల్లికి రోల్ మోడల్.. రేవంత్ రెడ్డి సంచలన ట్విట్

-

తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న మరోసారి ఎన్డీయే బీజేపీ ప్రభుత్వంపై , ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని.. బీజేపీని పారద్రోలాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీనికి బీజేపీ క్షమాపణలు చెప్పాలంటూ.. డిమాండ్ చేశారు. ఇలా సడన్ గా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కాంగ్రెస్ అనుకూల వాదనలను ఎత్తుకోవడం చర్చనీయాంశం అయింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ పరిణామంపై సంచలన ట్విట్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఊసరవెల్లి స్పెషాలిటీ అంటూ.. ట్విట్ చేయగా.. రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ ఊసరవెల్లికి రోల్ మోడల్ అంటూ ట్విట్ చేశారు. మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలపై నెటిజెన్లు మాత్రం కామెంట్లు ట్రోల్స్ మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news