75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ హర్ ఘర్ తిరంగా అంటూ.. ప్రతి ఇంటిపై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15నాడు జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర సాంస్కతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా హర్ ఘర్ తిరంగా అంటూ పాటను రిలీజ్ చేసింది. ఈ పాటలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్‌దేవగన్, ప్రభాస్, అనుష్క శర్మ, కీర్తీ సురేష్‌లతో పాటు.. ప్రముఖ క్రీడాకారులు కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, హర్థిక్ పాండ్యా, పీవీ సింధు తదితరులు ఉన్నారు.
అయితే ఈ పాటకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించినట్లు తెలుస్తోంది. అయితే.. హర్ ఘర్ తిరంగా అంటూ సాగే ఈ పాట దేశ భక్తిని ప్రతిబింబిస్తోంది. భారత్‌లోని అన్ని ప్రాంతాలను ఏకం చేస్తూ ఈ పాటను రూపొందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేశ భక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా హర్ ఘర్ తిరంగా కోసం దేశ ప్రజలకు పంపిణీ చేసేందుకు భారీ సంఖ్యలో జాతీయ జెండాలను తయారుచేస్తున్నారు.