గత మూడు రోజుల ముందు తెలంగాణ రాష్ట్రంలో మొదలైన పదవ తరగతి పరీక్షలు రెండు పరీక్షల వరకు ప్రశాంతంగా సాగలేదు. ఎందుకంటే మొదటి రేణుడి రోజులు తెలుగు మరియు హిందీ పేపర్ లను లీక్ చేశారు. తెలుగు పేపర్ ను ఒక టీచర్ లీక్ చేయగా, రెండవ పేపర్ లీక్ లో ఎంపీ బండి సంజయ్ జోక్యం ఉందన్న నేరంతో ఆయనను జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనా తెలంగాణ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
పేపర్ లీక్ చేస్తున్న నేరస్థులను జైల్లో పెట్టడం వలనే ఇప్పుడు పడవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అంటూ సెటైర్ వేశాడు. ఇదే సమయం అని భావించిన హరీష్ రావు… విద్యార్థులకు చదువులు చెప్పేది మాత్రం బి ఆర్ ఎస్ , వాటిని లీక్ చేసేది బీజేపీ అని ఫైర్ అయ్యారు. ఇకనైనా ఇలాంటి కుట్రపూరిత పనులకు దూరం ఉండాలని బీజేపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.