చంద్రబాబు మోసాలను, కుట్రలను పటాపంచలు చేస్తున్నాం : మంత్రి అంబటి

-

చంద్రబాబు మోసాలను, కుట్రలను పటాపంచలు చేస్తున్నామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరిపోయే దీపం టీడీపీ అని, జగన్ కు వణుకు పుట్టిందని చంద్రబాబు అంటున్నాడని, జగన్ కు భయం అనేది ఉండదని అందరికీ తెలుసనని ఆయన వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు రంకెలు వేస్తున్నాడని, 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాల్‌ విసిరారు. వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్ కు వెళ్ళిందని, చంద్రబాబు వెళ్ళమంటే వెళ్ళాడు అని అందరికీ తెలుసు అని ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా.. ‘బీజేపీతో విడాకులు తీసుకోవటానికి వెళ్ళాడా?? టీడీపీతో విడాకులు తీసుకుంటానని చెప్పాడా?? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి ఒక రాజకీయ పార్టీ పెట్టాడు.

AP Minister Ambati Rambabu Comments On Chandrababu And Pawan - Sakshi

పవన్ కు కావలసిన ప్యాకేజి చంద్రబాబు దగ్గర ఉంది. చంద్రబాబు పల్లకి మోసే వ్యూహాన్ని నాదెండ్ల మనోహర్ అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాదెండ్ల మనోహర్ అఙానంతో మాట్లాడుతున్నాడు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని అధికారులు సంతకాలు పెట్టారని మనోహర్ చెప్పాడు. ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి బుద్ధి ఙ్ఞానం ఉందా. ప్రజలను తప్పు పట్టించే విధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను సవాల్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అసెంబ్లీ వేదిక పైనే చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని’ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news