రైతులకు శుభవార్త : రుణమాఫీ పై కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన !

కరీంనగర్ జిల్లా : రైతులకు ఇప్పటికే రూ. 50 వేల రుణ మాఫీ చేసామని.. వచ్చే మార్చి లోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఇల్లందకుంట మండలం లోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భం గా హరీష్ రావు … ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయ్ ఒక్కసారి ఆలోచించాలని.. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కు పని చేసే వాళ్ళను గెలిపించాలని.. ఈటల లేనిపోని మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

ఈటల ఇంతకు ముందు ఏమి చేశాడు ముందటికి ఏమి చేస్తాడో చెప్పి ఓట్లు అడగాలన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చింది టీఆరెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబెట్టాయని.. వాన చినుకు పడక ముందే రైతుల ఖాతాలో 5 వేల రూపాయలు వేసింది టీఆరెస్ పార్టీ అని పేర్కొన్నారు.