పండుగ పూట : గ్యాస్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

గత కొన్ని నెలలుగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రూ. 450 లకు ఉన్న సిలిండర్ ప్రస్తుతం రూ. 900 క్రాస్ అయింది. దీంతో సామాన్య ప్రజలు… పెరిగిన గ్యాస్ ధరల కారణంగా చుక్కలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… హిందుస్థాన్ పెట్రోలియం తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

gas
gas

గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచిన నేపథ్యంలో నవరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆఫర్ ను కల్పిస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం తన వినియోగదారులకు నవరాత్రి సందర్భంగా గ్యాస్ సిలిండర్ కొనుగోలు పై పదివేల వరకు బంగారం గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

హిందుస్థాన్ పెట్రోలియం యొక్క బంపర్ నవరాత్రి ఆఫర్ పీరియడ్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 16 వ తేదీ ల మధ్య ఉండనుంది. ఈ ఆఫర్ కింద ఐదుగురు లక్కీ విజేతలను ప్రతిరోజు ఎంపిక చేస్తారు. ఈ ఆఫర్ సమాచారాన్ని హిందుస్థాన్ పెట్రోలియం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం డబ్బు చెల్లించవచ్చని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ.