రైతుబంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది – హరీష్ రావు

-

రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందన్నారు మంత్రి హరీష్ రావు. పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని ప్రశ్నించారు హరీష్ రావు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం అన్నారు. ఐటిఐఆర్ ను బెంగళూర్ కు తరలించారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారని.. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు? అని నిలదీశారు హరీష్ రావు. అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార్ వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ గారు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news