తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్‌.. రుణమాఫీపై నిర్ణయం

-

సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ అందిస్తున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని.. ఇక్కడి బియ్యాన్ని పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పారు. CM KCR హామీ మేరకు నెల రోజుల్లో రైతులందరికీ రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హరీశ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ లీడరైనా రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కాంగ్రెస్ నేతలు పారిపోయారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే ఏకంగా తుపాకీ పట్టుకొని తిరాగారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతోందని, ఈసారి 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని అన్నారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రమాణం చేయడం తధ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు, అసత్య ఆరోపణలు పట్టుకొని ఆగం కావొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news