కొత్త పెన్షన్ దారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

-

అతి త్వరలోనే అర్హులైన వారికి కొత్త పెన్షన్ లు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. రూ.15 కోట్లతో 18 కిమీ మేర ఈ గ్రామం మీదుగా డబుల్ లైన్ రోడ్ పనులకు శంఖు స్థాపన చేశామని.. మండే ఎండ కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో చెరువులు మత్తల్లు దుంకుతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు ఒక మడి ఎండకుండ పంట పండించలేదు, గతంలో కలిపోయే మోటార్లు , పెలి ట్రాన్స్ ఫార్మర్ లు ఉండేవన్నారు.

బిజెపి , కాంగ్రెస్ నాయకులకు కండ్లు ఉండి చూడలేని కబోధిలు అయ్యారు, మహారాష్ట్ర రైతులు తెలంగాణ బార్డర్ లో భూమి కోని అక్కడ బోరు వేసి ఆ బోరు ద్వారా నీళ్లను అక్కడ పొలానికి తీసుకెళుతున్నారని వెల్లడించారు. పెక్ వాట్సప్ యునివర్సిటీతో బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని.. స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. వడ్లు కొనమని మోడీ ప్రభుత్వం మొండికేస్తుంది, పంజాబ్ వడ్లు కోని తెలంగాణ వడ్లు ఎందుకు కొనది ? అని నిలదీశారు.

మద్దతు ధర వడ్లకు ఇచ్చి వడ్లు కొనకుండా బియ్యం కొంటామంటున్నారని.. కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిస్తం ,తొందరపడి ఎవరు భూములు అమ్ముకోవద్దు భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయన్నారు. వెయ్యి పడకల ఆసుపత్రి ఈ గ్రామ శివారులో రాబోతుంది ,వంద కోట్లతో పామాయిల్ ఫాక్టరీ నిర్మిస్తున్నాం, అందరూ పామాయిల్ పంటలు వేయాలని పిలుపు నిచ్చారు. త్వరలో అభయ హస్తం డబ్బులను మిత్తితో సహా చెల్లిస్తామని ప్రకటన చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news