BRS పార్టీతో దేశంలో సంచలనాలు సృష్టిస్తాం – హరీష్‌ రావు

-

BRS పార్టీతో దేశంలో సంచలనాలు సృష్టిస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు. కేసీఆర్ గారి సారథ్యంలో నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని తెలిపారు.

స్వరాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన కేసీఆర్,ప్రజల ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. అభివృద్ధి,సంక్షేమంలో కేంద్రం,కేంద్ర మంత్రులు,నీతి ఆయోగ్ లు దేశానికి రోల్ మోడల్,ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారని గుర్తు చేశారు.

స్వరాష్ట్రంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లుగానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకెళ్లాలి,దేశంలో మార్పు తేవాలని సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన మహా యజ్ఞము ఇది. జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గత అక్టోబర్లో విజయ దశమి పర్వదినాన ప్రకటించారని వివరించారు. నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును దృవీకరించడం సంతోషకరం.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు.సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి స్పూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకుందాం.దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగేద్దామన్నారు హరీష్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news