బీజేపోడు సమాధులు తవ్వుతే..కాంగ్రెసోడు కూలగొడుతా అంటాడు – హరీష్‌ రావు

-

బీజేపోడు సమాధులు తవ్వుతే..కాంగ్రెసోడు కూలగొడుతా అంటాడని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సీరియస్‌ అయ్యారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడుతాయి..మట్టిపనికైనా ఇంటిపనికైనా మనోడు ఉండాలేనని చెప్పారు. కేసీఆర్‌కి తెలంగాణపై ప్రేమ ఉంటది..కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లకి పెదవులపై ప్రేమ..తెలంగాణపై కపట ప్రేమ ఉంటుందని మండిపడ్డారు.

కేసీఆర్‌ తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాటు పడుతున్నాడు.. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు…నాలుకకు నరం లేదని విమర్శలు చేశారు. కాళేశ్వరం దండగ అన్నారు.. వాళ్లవి అన్ని గ్లోబెల్ ప్రచారాలు.. కాళేశ్వరం దండగ కాదు పండుగ అన్నారు.

కేసీఆర్‌ అనే అద్భుత దీపం రాదే రాదన్న తెలంగాణను తెచ్చిండు.. కానే కాదన్న కాళేశ్వరంని పూర్తి చేసి నీళ్లను అరకిలోమీటర్ పైకెత్తి నీళ్లను తెచ్చిండు పంట పండిందన్నారు. ఢిల్లీలో కూర్చోని కాళేశ్వరం దండగ అంటున్నారు..ఢిల్లీలో ఉన్నోనికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. గల్లీలో ఉన్నోనికి కాళేశ్వరం గురించి తెలుసు..కాళేశ్వరానికి పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తీరిపోయిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news