గ్రేట్ పర్ఫామర్స్ అంటూ ఆ ఇండస్ట్రీ నటులను ఆకాశానికి ఎత్తేసిన సమంత..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది చిత్ర బృందం. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మలయాళం నటులని ఆకాశానికి ఎత్తేసింది.

లేటెస్ట్ గా శాకుంతలం స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా సమంత మలయాళ నటుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన నటన మీద తనకు అనుమానం వచ్చిన ప్రతిసారి మలయాళం సినిమాలు చూస్తానని, తాను ఫాహద్ ఫాజిల్ తో కలిసి సూపర్ డీలక్స్ చిత్రంలో నటించానని ఈ సినిమాలో అతని నటన అంటే తనకు ఎంత ఇష్టమని తెలిపారు. ప్రతి మలయాళం నటుడు గ్రేట్ పర్ఫార్మర్ అని చెప్పుకొచ్చిన సమంత వారితో మళ్ళీ మళ్ళీ పనిచేయాలనిపిస్తుందని తెలిపారు.

Ashwanth Ashokkumar | Cinema Chaat

కాగా తాజాగా యశోద చిత్రంతో హిట్ అందుకున్న సమంత శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకులకు తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమవుతుంది. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత ఉత్సాహంగా పాల్గొంటుంది. శాకుంతలం సినిమా కథ విన్నప్పటి నుంచి సినిమా చేసేందుకు చాలా ఎగ్జైటింగ్ అనిపించిందనీ… గుణశేఖర్ గారు ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారని.. సినిమా అందరిని అలరిస్తుందని చెప్పుకొచ్చారు. శాకుంతలం లాంటి సినిమాలు ప్రతి నటికి లైఫ్ లో ఒక్కసారి వచ్చే ఛాన్స్ అని.. ఈ సినిమా చేయకపోతే తను చాలా మిస్ అయ్యే దాన్ని అంటున్నారు సమంత.

Read more RELATED
Recommended to you

Latest news