కేంద్ర మంత్రి తోమ‌ర్ బ‌హిరంగ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి : హ‌రీష్ రావు

-

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. స్వయంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ నల్ల చట్టాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాల‌ని..భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రద్దు చేసిన చట్టాలు చాలా మంచివని, ఆ చట్టాలను మరో రూపంలో తీసుకోస్తామని చెప్పడం సరికాదని నిప్పులు చెరిగారు. యేడాది పాటు రైతులంతా పోరాటం చేసి, ఆ చట్టాలు రద్దు చేయిస్తే తిరిగి ఆ నల్ల చట్టాలను తెస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ మాట్లాడటం యావత్ దేశ రైతాంగాన్ని అవమానం, కించపర్చడమేన‌ని ఆగ్ర‌హించారు.
తిరిగి నల్లా చట్టాలు తెస్తే.. 700 మంది రైతుల ఆత్మ గోషిస్తదని, కించపర్చినట్లు అవుతుందని, నల్ల చట్టాలను తిరిగి ప్రవేశ పెడతామని చెప్పడం సరికాదని మంత్రి హరీశ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news