పరిశుభ్రతపై తెలంగాణ ప్రజలకు హరీష్‌ రావు కీలక సూచనలు

-

డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా పారిశుధ్యం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు… ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు ఇంటి చుట్టు పరిశుభ్రతకు కేటాయించాలని పిలుపు ఇచ్చారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.డెంగ్యూ నివారణ లో భాగంగా మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్య కార్యక్రమం నిర్వహించారు.

మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లిన్ చేశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని..ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news