ఈరోజు పఠాన్ చెరులో జీ హెచ్ఎంసీ ఎన్నికల సమావేశం నిర్వహించారు తెలంగాణా మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుందని, బీజేపీ వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలని అన్నారు. ఎవ్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి, కానీ ఆ పార్టీలు ఏం చేశాయని ఓట్లు వేయాలి ? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలకు అసలు ఓటు ఎందుకు వేయాలి.? అని ప్రశ్నించిన అయన బీజేపీ కరోనా తో కూడా రాజకీయాలు చేస్తోందని అన్నారు. బీహార్ ఎన్నికలలో గెలవడానికి మేం గెలిస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రచారం చేసింది. మరి తెలంగాణకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా.. ? హైదరాబాదు ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వరా.. ? అని ప్రశ్నించారు. బీజేపీది దిగజారుడు రాజకీయమన్న ఆయన కాంగ్రెస్ ఏం చేసింది.. ? బీజేపీ ఎం చేసింది. ? అనే విషయాలు , తెరాస గెలిచాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెరాస కార్యకర్తలు గడప, గడపకు ,గుండె, గుండెకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.