బిజెపి నాయకులకు ఒక శాపం ఉంది.. అందుకే అబద్దాలు అడుతారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరని ఎద్దేవా చేశారు. నిన్న పాలమూరు మీటింగులో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు… బిజెపి మంత్రులకు, బిజెపి నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని విమర్శించారు.
కేంద్ర బిజెపిలో ఆధిపత్య పోరు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెపితే, నాయకులు మరో మాట చెబుతున్నారు.. బిజెపిది పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఇంకో పాట అని ఫైర్ అయ్యారు. నిన్న నడ్డా గారు ప్రధానంగా ఐదు విషయాలు ప్రస్తావించారన్నారు. బీజేపీ అబద్దాల పార్టీ.. ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు ఇవ్వలేదని నడ్డా అంటాడని మండిపడ్డారు. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అని గడ్కారీ అంటారు.. కాళేశ్వరం అనివీతి మయం అని నద్దా అంటాడని అగ్రహించారు. కేంద్ర మంత్రి పార్లమెంట్లో కాళేశ్వరం లో అనినీతి లేదంటాడు.. ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్టు అని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.