మనం పూజల్లో తామర పువ్వులు వాడుతాం. ఆ పువ్వుల లోపల గింజలు ఉంటాయి.. పూర్వం రోజుల్లో అయితే.. ఊర్లల్లో వారు ఈ గింజలను వాడుకునే వారు.. ఇప్పుడు వీటినే పూల్ మఖనీ పేరుతో అందరూ వాడుకుంటున్నారు.
మీకు కూడా తామర గింజలు అంటే తెలియదు..కానీ పూల్ మఖనీ అనే సరికి గుర్తుపట్టేశారు కదా.. ఈ గింజలతో స్పెషల్ గా చాలా రకాల వంటలు చేసుకుంటారు. వీటితో చేసే వంటలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు మనం ఈ గింజల్లో ఏం ఏం పోషకాలు ఉంటాయి, ఇది ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనే విషయం చూద్దాం.
100 గ్రాముల తామర గింజల్లో ఉండే పోషకాలు
- పిండి పదార్థాలు 64.5 గ్రాములు
- మాంసకృతులు 15 గ్రాములు
- శక్తి 347 కాలరీలు
- పొటాషియం 1368 మిల్లీ గ్రాములు
- ఫాస్పరస్ 626 మిల్లీ గ్రాములు
- ఫోలిట్ 104 మైక్రో గ్రాములు
- మెగ్నీషియం 210గ్రాములు
- ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ 102 మిల్లీ గ్రాములు
- ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్స్ 1064 మిల్లీ గ్రాములు
ఈ గింజలు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి.?
2015వ సంవత్సరంలో అగ్రికల్చర్ అండ్ ఫారెస్టరీ యూనివర్సిటీ( Agriculture and Forestry University- China) వారు ఈ గింజలపై పరిశోధన చేశారు. వాళ్లు తామర గింజల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏం అంటున్నారంటే..
లివర్లో అనేక రకాల ఫ్రీ రాడికల్స్ పేరుకుంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ అన్నింటిని క్లీన్ చేయడానికి ఈ గింజలు సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఇందులో ఉన్న ఒమేగా3ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్ కూడా లివర్ కు మేలు చేస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు.
ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఈరోజుల్లో చాలామందికి ఉంటున్నాయి. రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేసి అనేక రోగాలకు కారణం అవుతాయి. ఈ దాడిని తిప్పికొట్టి..ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా చేయడానికి తామర గింజల్లో ఉండే..సూపర్ ఆక్సైడేస్ డిసిమిటేస్ ( Super Oxidize Dismutase), హైపరిన్ ( Heparin) అనేవి ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి, ప్రేగుల్లో హెల్ప్ ఫుల్ బాక్టరియాను పెంచడానికి ఈ గింజలు ఉపయోగపడుతున్నాయి.
- విటమిన్k, విటమిన్ b12 తయారుచేయడానికి కూడా ఈ గింజలు మేలు చేస్తాయి.
స్ట్రస్ వల్ల రిలీజ్ అయ్యే కార్టికోస్టిరాల్ లెవల్స్( Cortico Strial) ను తగ్గించడానికి కూడా తామరగింజలు ఉపయోగపడుతున్నాయని కూడా పరిశోధనలో ఇచ్చారు. ఇవి తక్కువగా ఉంటే..ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది.
బీపీని తగ్గించడానికి, బ్లడ్ విజల్స్ ను స్మూత్ చేసి, కొవ్వు పేరుకోకుండా రక్షించడానికి తామర గింజల్లో బీటాసైటోస్టిరాల్ (Beta Sitosterol), లిన్సిన్ అనే కెమికల్స్ ఈ రెండు ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయట.
- ఇది యవ్వనంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
- మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ గింజలు చాలా మంచిదట.
- ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు చాలా దోహదపడుతుంది..
- ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయని సైంటిఫిక్ గా కూడా నిరూపించారు కాబట్టి.. వీలున్నప్పుడల్లా మీరు కూడా వంటల్లో వాడుకోవడానికి ప్రయత్నించండి.
-Triveni Buskarwothu