ఓట్స్ తో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

-

ఓట్స్ ను మనం రోజు తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య లాభాలున్నాయి. ఇది మంచి నాణ్యతను సహజంగా కలిగి ఉంటాయి. ఓట్స్ లో ఫైబర్ మరియు సోడియం ,పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఓట్స్ ను పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకుంటూంరు. అలానే ఓట్స్ ఓవర్నైట్ నానబెట్టి , పొద్దున్నే వాటి పైన పండ్ల ముక్కలు, నట్స్ మరియు చియా సీడ్స్ వేసుకొని తీసుకుంటారు.ఇలా తీసుకోవడం వలన మనకి కాల్సియం మరియు ఐరన్ లభిస్తుంది.పొద్దున్నే ఇలా ఆయిల్స్ లేకుండా బ్రేక్ ఫాస్ట్ చేయడం వలన మన ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.

ఓట్స్ లో రెండు రకాలున్నాయి :

1. స్టీల్ కట్ ఓట్స్
2. రోల్డ్ ఓట్స్

1.స్టీల్ కట్ ఓట్స్ : స్టీల్ కట్ ఓట్స్ ను ఐరిస్ ఓట్ మీల్ అని పిలుస్తారు. తక్కువ ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు.ఇలా చేయడం కోసం ఓట్స్ ని కట్ చేసి చేస్తారు. వీటిని కట్ చేయడానికి స్టీల్ బ్లేడుని వాడుతారు. ఇవి నమలడానికి బాగుంటాయి మరియు గట్టిగా కూడా ఉంటాయి.వీటిని వాడుకునే ముందు ఒక 15 లేదా 20 నిముషాలు నానబెట్టాలి. వీటితో సలాడ్స్, కిచిడి, పొంగల్, ఉప్మా, చపాతీ, దోస,పకోడీస్ వంటి ఇతర వంటకాలు కూడా చేసుకోవచ్చు.

2. రోల్డ్ ఓట్స్ : ఇది చాలా పాత ఫ్యాషన్. ఎక్కువ సార్లు ప్రాససింగ్ చేసి తయారు చేస్తారు.స్ట్రీమింగ్ మరియు ప్లేటనింగ్ ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు .అందువల్ల అవి సాఫ్ట్ గా మారుతాయి. ఎక్కువ ప్రాసెస్ చేయడం వలన వండడం చాలా సులువు అవుతుంది. వీటిని తయారు చేసుకోవడనికి 2నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది.వీటితో కూడా చాలా రకాల వంటలు చేయవచ్చు. ముఖ్యంగా కేక్స్, బ్రెడ్, స్మూతిస్, కుక్కిస్ వంటివి తయారు చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news