ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది మూలికలు వంటి వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. కెమికల్స్ లేకుండా నాచురల్ గా ఉండే వాటి పై కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. చక్కటి గుణాలు కలిగిన కానుగ చెట్టు వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి.
కానుగ చెట్టు ఆకులు, పువ్వులు వేర్లు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పైగా ఇది చాలా సమస్యల్ని తరిమి కొట్టేస్తుంది. మరి దీని వలన కలిగే ఉపయోగాలు ఏమిటి…? ఎలాంటి సమస్యలను మనం తరిమి కొట్టొచ్చు అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
కానుగ చెట్టు పూల ని ఉపయోగించడం వలన అంటు వ్యాధులు తొలగిపోతాయి.
అలానే అల్సర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. పొత్తికడుపులో కనితులను కూడ ఇది తొలగిస్తుంది. అంతే కాదండి కానుగ చెట్టు పండ్లని చికిత్సకి వాడతారు.
రక్తస్రావం, హేమర్హయిడ్స్, పైల్స్ చికిత్స కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
అధిక రక్తపోటు, రక్తహీనత చికిత్సకి కూడా కానుగ చెట్టు విత్తనం ఉపయోగపడుతుంది.
జ్వరం, దగ్గు, బ్రోన్కైటీస్ వంటి వాటికీ ఈ ఆకుల పొడి బాగా ఉపయోగపడుతుంది.
కాలేయ నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, అల్సర్స్ వంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
రక్తస్రావ నివారిణిగా పరాన్న జీవి పురుగులను చంపడానికి కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని సమస్యలని కానుగ చెట్టు ఆకులు, పువ్వులు విత్తనాలు దూరం చేస్తాయి.