వైసీపీ రెబల్స్ టీడీపీలో పోటీ..మళ్ళీ గెలుస్తారా?

-

అధికార వైసీపీకి కొందరు నేతలు దూరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సొంత వాళ్లే వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి ఉంది. దీంతో కొందరు నేతలు వైసీపీకి దూరం జరిగారు. అందులో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. గెలిచిన ఆరు నెలల్లోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే.

కొందరు ఎమ్మెల్యేలపై విమసలు చేసిన ఆయన..సొంత పార్టీ పట్టించుకోకపోవడంతో..ఆయన వ్యతిరేకంగా మారిపోయారు. అప్పటినుంచి వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఫైర్ అవుతున్నారు. ఆయనకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా చూస్తుంది. ఇక వైసీపీ నుంచి దూరం జరిగిన ఈయన..నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తులో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కాకపోతే కరెక్టు గా ఏ పార్టీలో పోటీ చేస్తారు..ఏ సీటులో పోటీ చేస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో తనతో పాటు వైసీపీ రెబల్స్ గా మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం పోటీ చేసి మళ్ళీ గెలుస్తామని చెబుతున్నారు.

ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం సైతం పార్టీకి దూరం జరిగారు. సొంత పార్టీ వాళ్ళే తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఆరోపించి కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చారుల. ఈయన టి‌డి‌పిలోకి వెళ్లడానికి చూస్తున్నారు. అటు ఆనం కూడా టి‌డి‌పిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం మీద ఈ ముగ్గురు రెబల్స్ టి‌డి‌పి లేదా జనసేనలో చేరి..వైసీపీపై పోటీ చేసి గెలుస్తామని అంటున్నారు. మరి ముగ్గురు రెబల్స్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news