పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అని అన్నారు మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ. ఉత్తరాంధ్రలో పాదయాత్ర ద్వారా అక్కడ అశాంతి ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్ర వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో అల్లర్లు, గొడవలు సృష్టించి లబ్ది పొందాలని చూస్తున్నారని.. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
ప్రజలను రెచ్చగొట్టే పాదయాత్రను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. మేనిపేస్టో అంటే హామీలు ఇవ్వడమే, అమలు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అనుకున్నాడని ఎద్దేవా చేశారు. చంద్ర బాబు కు ప్రజల ను మోసం చేయడం, దోచుకోవడం, వారి మనుషులు కు పంచిపెట్టడమే తెలుసన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి ప్రజల దృష్టిని మరల్చి చంద్రబాబు అధికారం లోకి రావాలని అనుకుంటున్నాడన్నారు. చంద్రబాబు కుటిల, కుతంత్ర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.