ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీ యువతులకు వివాహ సహకారం కోసం కళ్యాణమస్తు, షాది తోఫా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పెళ్లికూతురు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలని నిబంధన పెట్టామన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. మూడున్నర ఏళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన 98% పథకాలు పూర్తి చేయడం ఒక రికార్డు అని అన్నారు.
ఉచిత ఇసుక అనే పేరు పెట్టి టిడిపి అంతా దోచుకుందని విమర్శించారు. ప్రజల ఆలోచనను పక్కదారి పట్టించేందుకే కొన్ని పత్రికలు లేనిపోని కథనాలు రాస్తున్నాయన్నారు. అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర అంటున్నారని.. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కానవసరం లేదా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు బొత్స. ఒప్పందంలో ఎక్కడైనా డివియేట్ అయ్యామెమో చెప్పండి? అన్నారు. చంద్రబాబు చెవిలో పూలు పెడితే వినడానికి మేము ఏమైనా చిన్నపిల్లలమాా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారా! అని మండిపడ్డారు.