రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు.ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నట్లుతెలుస్తోంది. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డి.శ్రీనివాస్ మృతి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతాపం తెలిపారు.
మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న డీఎస్.. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిశాను అని అన్నారు. నా రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి అడిగి.. జనసేన పార్టీ ఎదుగుదలను ఆయన ఆకాంక్షించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని పవన్ కల్యాణ్ తెలిపారు.