మల్బరీ పండ్లతో ఎన్ని లాభాలో..అందం, ఆరోగ్యం రెండూ..

-

పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ ఆకు ప్రాధాన్యం. దీనికోసం మల్బరి చెట్లు పెంచుతారు. ఈ చెట్లకు కాసే పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. కానీ ఇవి తినడానికి ఎవరూ ఇష్టపడరు. షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ పండ్లలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. చైనాలో సాంప్రదాయ మూలికా వైద్యంలో గుండె జబ్బులు, మధుమేహం, రక్తహీనత, ఆర్థరైటిస్ చికిత్సలకు మల్బరీలను కొన్ని ఏళ్లగా వాడుతున్నారట.

మల్బరీ ఆరోగ్య ప్రయోజనాలు :

విటమిన్ సి ఎక్కువగా ఉండంటంతో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఉండవు. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

మల్బరీలో రెస్వెరట్రాల్ అనే యాంటీయాక్సిడెంట్ వల్ల ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గిస్తుంది. రెస్వెరట్రాల్ అనే ముఖ్యమైన ఫ్లెవనాయిడ్ రక్త నాళాలల పనితీరులో ప్రత్యక్ష్యంగా ప్రభావితం చేస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని , స్ట్రోక్ ,గుండె పోటు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండ్లను తినటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తప్రసరణ బాగా సాగుతుంది. దాంతో..గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే.. గుండెపోటు భారినపడుతున్నారు.

మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. ఎల్ డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి. మల్బరీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గుతాయని సైంటిస్టులు కనుగొన్నారు.. అంతేకాకుండా డయాబెటిస్ వల్ల వచ్చే బరువును నియంత్రించటంలో సహాయకారిగా పనిచేస్తాయి. కాలేయానికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించటంలో దోహదం చేస్తాయి.

మల్బరీ పండ్లలో పీచు పదార్ధాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి..మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారిస్తాయి.. మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేయటమే కాకుండా శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయో కదా మల్బరీ పండల్లో.. దొరికితే కచ్చితంగా తీసుకోండి మరీ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news