నేడు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు ద్యానమందిరాన్ని కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా భీమవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… స్వతంత్రం కోసం చాలామంది ఉద్యమాలు చేశారని, కానీ పోరాటం చేసి బలిదానం అయిన వాళ్ళు కొంతమందని, వాళ్లలో అల్లూరి సీతారామరాజు ఒకరిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. అల్లూరి పేరు వింటేనే.. ఆయన చరిత్ర తెలుసుకుంటేనే మనకు ఒళ్ళు పులకరిస్తోంది అని అన్నారు.
అల్లూరి సీతారామరాజు జయంతి అనేది ఒక భీమవరంలోనే కాదని.. అన్ని ప్రాంతాలతో పాటు ఢిల్లీ లోని విజ్ఞానభవన్ లో జరపాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. జూలై 4న ప్రత్యేక విమానంలో మోడీ విజయవాడ వచ్చి అక్కడి నుంచి డిఫెన్స్ హెలికాప్టర్లో భీమవరం వస్తారని తెలిపారు. విశాఖ జిల్లాలో అల్లూరి సీతారామరాజు పేరిట 35 కోట్ల రూపాయలతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.