మనం ఊర్లలో, పొలాల్లో చాలారకాల పిచ్చిమొక్కలను చూస్తాం కానీ వాటిపేర్లు, ఆ మొక్కల ఉపయోగాలు మనకు తెలియదు. దాంతో వాటిని అసలు పట్టించుకోం.. అడ్డుగా ఉన్నాయంటే వాటిని నరికేస్తారు కూడా. మీకు అర్జునపండు గురించి విన్నారా.. ఇది కూడా పేరు కంటే. చూస్తేనే గుర్తుపడతారు. ఓర్ని ఇదా అనుకుంటారు. అర్జునపండును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారట. ఈ పండులో చాలా ఔషధగుణాలు ఉన్నాయని మీకు తెలుసా..?
అర్జున పండు వల్ల ఉపయోగాలు..
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
దగ్గును నివారిస్తుంది. పొట్టని క్లీన్ చేస్తుంది.
మూత్ర విసర్జనలో వచ్చే సమస్యలను సైతం ఈ పండు తగ్గించగలదు.
మూత్ర నాళాల సమస్యలను తగ్గిస్తుంది.
ముడతలు, మచ్చలు, మొటిమలు మొదలైన సమస్యలని తగ్గిస్తుంది.
అర్జున బెరడుని ఇతర మూలికలతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
అర్జున బెరడు గుండె సంబంధ సమస్యలను కూడా నిరోధిస్తుంది.
అర్జున పండులో ఉండే గుణాలో నోటి దుర్వాసనని పోగొట్టగలుగుతాయి.. చిగుళ్ల సమస్య, పంటి నొప్పి, దంతాల రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు దంతాల సమస్యను తొలగించడంలో చక్కగా పనికొస్తాయి.
చర్మ సమస్యలను తొలగించడంలో అర్జున ఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అర్జున పండు పొడిని తయారు చేసి అందులో తేనె కలిపి చేసిన ఆ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. మచ్చలేని చర్మం మాత్రమే కాదు.
పాలతో కలిపి అర్జున బెరడు తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇది లిపిడ్ పెరాక్సిడేషన్ నిరోధిస్తుంది.
అయితే క్లినికల్ అధ్యయనాలు చేయకపోవడం వల్ల అర్జున బెరడు ప్రయోజనాలు ధృవీకరించలేదు. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా.. నిర్ణయాలను తీసుకునే ముందు మీ వైద్యులను సంప్రదించడం ఉత్తమం.