షుగర్‌, బీపీ, ఊబకాయం..సమస్యేదైనా.. సొల్యూషన్‌ కాకరకాయ టీ.. !!

-

కాకరకాయ అంటే చేదుకు కేరాఫ్‌ అడ్రస్‌ అనుకుంటారు. కానీ ఎన్నో వ్యాధులకు మెడిసిన్ కాకరకాయ. దీన్ని ఏ విధంగా తిన్నే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు రోజూ కాకరకాయను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. కాకరకాయతో కూర చేస్తారు, జ్యూస్‌ చేసుకుని తాగుతారు. అయితే టీ కూడా చేసుకుని తాగొచ్చని మీకు తెలుసా..? కాకరకాయ టీని ఎలా చేయాలో, ఏంటి లాభాలో చూద్దామా..!

కాకర కాయలను ముక్కలుగా చేసుకుని ఎండబెట్టుకోవాలి.. ఎండిన ముక్కలను నీళ్లలో వేసి వేడిచేయండి. ఓ పావు గంటసేపు బాగా మరిగించిన తర్వాత ఆ కాకర కాయల రసాన్ని వేరు చేసి దానికి తేనె, నిమ్మరసం కలిపుకుని తాగేయండి. అంతే.. ఈ మూడింటి మిశ్రమాన్ని నిత్యం తాగితే బీపీ సమస్య తగ్గుతుంది. షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. అధిక బరువుతో బాధపడేవారు సన్నబడతారు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇంకా కాకర కాయల టీ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను సైతం అడ్డుకుంటుంది. అందువల్ల రోజూ కాకరకాయ టీ తాగితే క్యాన్సర్ జబ్బును ముందే అరికట్టవచ్చు. కాకరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతరత్రా అనారోగ్యాలు దరి చేరవు.

కాకరకాయ తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇలా టీగా తాగలేమూ అనుకునే వాళ్లు.. జ్యూస్‌గా కూడా చేసుకుని తాగొచ్చు. ఇది ఇంకా తక్కువ ప్రాసెస్‌. కాకరకాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మొదట ఒకసారి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత నీళ్లు పోయండి. ఒక కప్పు కాకరకాయకు ఒక కప్పు నీళ్లు..పరిమాణంలో తీసుుకోండి. మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్‌ చేసుకుని అందులో నిమ్మరసం వేసుకుని తాగండి. జ్యూస్‌ అయితే టీ తాగినంత తాగితే చాలు.. బత్తాయి, దానిమ్మ జ్యూస్‌ల్లా గ్లాసులు గ్లాసులు తాగక్కర్లా.. మొదటిరోజు కాస్త చేదుగా అనిపిస్తుంది. నాలుగు రోజులు తాగితే చాలు.. అలవాటైపోతుంది. మీరు ఇలా డైలీ జ్యూస్‌ చేసుకుని తాగొచ్చు.. లేదా.. నాలుగురోజులకు సరిపడా చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తాగేముందు తీసి కూలింగ్‌ తగ్గాక తాగొచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అలా ఫాలో అవ్వండి.. కాకరకాయను మాత్రం వాడడం మంచిదండోయ్..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version