వాక్కాయతో ఇన్ని లాభాలా..! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

-

చాలామందికి కరక్కాయ గురించి విని ఉంటారు కానీ.. వాక్కాయ పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. వాక్కాయను ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు.. అంత రుచిగా ఉంటుంది. ఇంకా వాక్కాయను వంటల్లో కూడా వాడుకోవచ్చు. పప్పు,పచ్చడి, పులిహోర లాంటివి చేస్తారు. ఇందులో ఔషధుగుణాలు సమృద్ధిగా ఉన్నాయి. వాక్కాయ ఒగరు, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. మొదట ఆకుపచ్చగా ఉండి ఆ తర్వాత గులాబీ రంగులోకి వస్తాయి. వీటిలో పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల జామ్‌కు, జెల్లీల వంటివి చేస్తారు. ఇంకా ఈ వాక్కాయతో ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దామా..!

ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి,ఫైబర్,పాస్పరస్, ఆస్కార్బిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. ఆస్కార్బిక్ ఆమ్లం కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేయటమే కాకుండా పిత్తాశయ సమస్యల నివారణకు సహాయపడుతుంది.

వాక్కాయతో ఈ ఆరోగ్య సమస్యలు మాయం..!

శరీరంలోని మంటను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
క్యాన్సర్ దరిచేరకుండా చేస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
రక్తంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.
డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు.
శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ టోన్ సమస్యలు లేకుండా చేస్తుంది.
ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త హీనత ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
వాక్కాయలలో యాంటీ మైక్రో బెయిల్ లక్షణాలు ఉండుట వలన ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని దూరం చేస్తాయి.
ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి.
నీర‌సం, అల‌స‌ట, ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.
డయబెటీస్‌ ఉన్నవారికి వాక్కాయ చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
వాక్కాయ ఆకులతో తయారుచేసిన కషాయాన్ని రోజులో రెండు సార్లు తీసుకుంటే జ్వరం దెబ్బకు తగ్గుతుంది.
వాక్కాయలలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యాలు తొలగిపోతాయి.
మూత్రపిండాలలో రాళ్ళని కరిగించే విగా మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి.
అంతర్గత రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఔషధంగా తోడ్పడతాయి.
చెడు కొలెస్ట్రాల్ క‌రిగించటంలో తోడ్పడుతుంది.
గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.
గుండె కండ‌రాలు కూడా బ‌లోపేతం అవుతాయి. తక్షణ శక్తిని ఇస్తుంది.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..మీకు ఈ కాయ దొరికితే కచ్చితంగా వాడుకునేందుకు ప్రయత్నించండి.! 

Read more RELATED
Recommended to you

Latest news