మునగ పూలతో టీ..బరువు తగ్గడానికి, జీర్ణక్రియను పెంచడానికి ఇంకా ఎన్నో లాభాలు..!

-

మునగ కాయలతో సాంబార్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది..పుష్టిగా భోజనం చేయొచ్చు. అసలు మునగ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో..ములక్కాయలే కాదు..ఆకులతో పప్పు చేసుకుంటారు..ఇక్కడ వరకే అందరికి తెలుసు..కానీ ములగ పువ్వుులతో ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు మనం వీటివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది చూద్దాం.

మునగ పువ్వులలో ప్రొటీన్లు, అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మునగ పువ్వులు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. మునగ పువ్వులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో..ఫ్రీ రాడికల్స్ తో పోరడతాయి.

మునగ పువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పువ్వులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి పొట్టలో ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లు, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బరువు తగ్గడంలో మునగ పువ్వులు బాగా పనిచేస్తాయి. ఈ పువ్వుల్లో క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో పనిచేస్తుంది. అంతే కాదు ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. ఆకలిని కూడా నియంత్రిస్తుంది.

మునగ పూలు పురుషుల్లో పటుత్వాన్ని పెంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ పూలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అలసట, బలహీనత తగ్గి.. బలం పెరుగుతుంది.

మహిళల్లో మూత్ర సంబంధ సమస్యలు (UTI) నుంచి కూడా మునగ పువ్వులు ఉపశమనం కలిగిస్తాయి. ఈ పూలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తొలగిపోవడమే కాకుండా.. వాపు, కండరాల నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

గర్భిణీలు మునగ పువ్వులను తింటే.. వారు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మునగ పూలను ఆహారంలో చేర్చుకోవటంవల్ల బాలింతలకు పాలుబాగా పట్టి..పిల్లలకు సరిపడా పాలు అందుతాయి. ఈరోజుల్లో చాలామంది బాలింతలు పాలలేమితో ఇబ్బందులు పడుతున్నారు.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో మునగ చెట్టు ఉంటే..పూలతో టీ చేసుకుని అప్పుడప్పుడు తాగటం మొదలుపెట్టేయండి. మంచి హెర్భల్ టీగా ఇది ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news