జాజికాయ పొడితోఎన్నో లాభాలు.. సైంటిఫిక్ గా తేలిన వాస్తవాలు..!

-

జాజికాయ గురించి ప్రతి గృహిణికి తెలిసే ఉంటుంది. పలావుల్లో, బిర్యానీల్లో వాడుతుంటారు. అంతే కానీ ఇక జాజికాయ ఎక్కడా వాడరు. జాజికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే.. మనం వాడుకోవచ్చు కదా.

ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషదగుణాలు కలిగిన వాటిల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయ మీద ఎంతో మంది పరిశోధన చేశారు. ఇందులో సైనడిన్స్, ప్రొపనాయిడ్స్ లాంటి కెమికల్స్ చాలా ఉన్నాయి. జాజికాయను ఒకపూటకు 7-8 గ్రాముల వరకే వాడుకోవాలి. రోజులో రెండుసార్లు వాడుకుంటే.. 15-20 గ్రాములు మించకూడదు.. అంతకంటే ఎక్కువ వాడితే.. మళ్లీ అనవసరమైన సైడ్ ఎఫెక్ట్ వస్తాయి.

సానపట్టే రాసి తీసుకుని జాజికాయను దానిమీద అరగదీసి.. నోట్లో పుండ్లు ఉన్నప్పుడు రాస్తే ఆ పుండ్లు త్వరగా మానతాయి. ఇంకా ఈ లేపానంతో వారానికి ఒకటి రెండు సార్లు పళ్లు తోముకుంటే.. పవర్ ఫుల్ యాంటీ బాక్టీరయాగా పనిచేస్తుంది. పళ్లు పుచ్చడాన్ని నివారిస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.

2017వ సంవత్సరంలో చికాగో స్టేట్ యూనివర్శిటీ వారు జాజికాయ మీద పరిశోధన చేసి.. బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేయడానికి పనికొస్తుందని నిరూపించారు. జాజికాయను అరగదీసి.. ఆ లేపనానికి తేనె రాసి బ్లాక్ హెడ్స్ మీద పెట్టేసి..20 నిమిషాలు ఉంచుకుని.. ఆ తర్వాత మీగడ రాసి రబ్ చేసి క్లీన్ చేస్తే.. నల్లటి మచ్చలు తగ్గుతున్నాయని కనుగొన్నారు.

బెంగుళూరు వారు కూడా జాజికాయ మీద పరిశోధన చేసి.. ఇది యాంటిడిప్రసెంట్ గా పనిచేస్తుందని నిరూపించారు. మూడ్ స్వింగ్స్ ను తొలగించడానికి, మానసిక అలజడని, కొంతమంది రకరకాల ఆలోచనతో.. ఆగం ఆగం అయితారు.. అలాంటివారికి జాజికాయ బాగా పనిచేస్తుంది. నైట్ నిద్రపోయే ముందు పాలల్లో 7-8 గ్రాముల జాజికాయ పొడి, బాదం పొడి, యాలకలపొడి వేసుకుని తాగి పడుకుంటే నిద్రబాగా పడుతుంది. డిప్రషన్ కూడా పోతుందని స్పష్టం చేశారు.

మేల్ సెక్స్ పొటెన్సీని జాజికాయ బాగా ఇంప్రూవ్ చేస్తుందని కూడా పరిశోధనలో తేలింది. 5 గ్రాముల పొడిని డైలీ తీసుకుంటే మగవారికి అలా మేలు జరుగుతుంది.

ఇవి జాజికాయ వల్ల ప్రధానంగా కలిగే లాభాలు.. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా జాజికాయ పనిచేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు.

జాజికాయను పౌడర్ చేసుకుని.. డికాషన్ లా చేసుకుని అందులో తేనె వేసుకుని కూడా తాగొచ్చు. జాజికాయ నూనె కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. దీని వల్ల.. మోకాళ్ల నొప్పుులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news