సగ్గుబియ్యం తో కలిగే లాభాలు ఎన్నో…!

-

కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. వీటిని మనం పాయసం, కిచిడి, ఉప్మా వగైరా వాటిలో ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇక దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చూస్తే… సగ్గుబియ్యంను తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్లకు బాగా ఉపయోగ పడతుంది. స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది.

ఇది ఇలా ఉండగా దీనిని తీసుకోవడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలను తక్షణం నివారిస్తాయి. అంతే కాదండి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉండే సగ్గు బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవడం మరెంత ప్రయోజకరం. దీనిలో ఉండే విటమిన్ కె మెదడుకి చాల మంచిది.

అలానే సగ్గు బియ్యం బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి. కండరాల గ్రోత్ కి సగ్గుబియ్యం చాల బాగా పని చేస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ప్రొటీన్స్ , క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. చూసారా..! సగ్గుబియ్యం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో…! మరి మీ డైట్ లో చేర్చండి ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news