ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ దుకాణాలకు తాళం

మందుబాబులకు గడ్డు కాలం రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీతో కొత్త ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు దుకాణాల్లో సైతం మందు అందుబాటులో ఉన్నందున ఎక్కడ పడితే అక్కడ దొరికే అవకాశం కలిగింది. ఇకపై మరికొన్ని రోజుల పాటు అలాంటి అవకాశం లేదు. అవును, ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకురావాలని చూస్తుంది. ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చేంత వరకు ఢిల్లీలోని ప్రైవేటు మద్యం దుకాణాలకు మూతపడనుంది.

మొత్తం ఢిల్లీలో 260ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ 260దుకాణాలన్నీ కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చే వరకు మూసి ఉంటాయి. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటిల్లో మాత్రమే మద్యం లభించనుంది. ఈమేరకు సెప్టెంబరు 30తర్వాత నుండి దాదాపు 40రోజుల పాటు ప్రైవేటు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. మరి కొత్త ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అమల్లోకి వస్తే గానీ తెలియదు.