విజయవాడ : రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మంగళవారం కోవిడ్ లక్షణాలతో కాకినాడలో ఇద్దరు యువకులు మరణించడంతో మరింత అప్రమత్తం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, ఆక్సిజన్ బెడ్స్ సిద్దం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కోవిడ్ వైద్య పరీక్షలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 31 ఆక్సిజన్ బెడ్స్ సిద్ధం చేశారు అధికారులు. రోజుకు 50 నుండి 100 కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేపడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఆరుగురుని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు వైద్యులు. నిన్న నమోదైన మూడు కేసులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.