జగన్ రంగంలోకి దిగారు; ఇక కరోనాపై పోరాటమే; మంత్రి

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా పరిస్థితిపై ఉన్నత సమీక్ష చేశారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానీ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 13 జిల్లాల్లో 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. వారిలో 140 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే అన్నారు. 1085 మంది ని ఢిల్లీ నుంచి వచ్చారని… 946 మంది రాష్ట్రంలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

139 మంది మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నారని… వీరిలో 881 మంది గుర్తించి టెస్ట్ చేసామని ఆయన చెప్పుకొచ్చారు. 108 పాజిటివ్ వచ్చిందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కాంటాక్ట్ అయిన వారిలో 32 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. జాగ్రతల్లో ముఖ్యమంత్రి మరిన్ని సలహాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. 1.45 కోట్ల కుటుంబాలకు 1.28 కోట్ల కుటుంబాల సర్వే పూర్తి అయిందని, లాబ్స్ కూడా పెంచాలని సీఎం చెప్పారన్నారు.

గుంటూరు కడప అదనంగా ఏర్పాటు చేసామని, విశాఖలో మరో లాబ్ సోమవారం అందుబాటులోకి వస్తుందని అన్నారు. 500 మందికి ఇప్పుడున్న వాటి ద్వారా టెస్ట్ చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త వాటితో 900 టెస్టులు చేయవచ్చన్నారు. ఇంకా ప్రైవేట్ లాబ్స్ కూడా పరిశీలించమని సీఎం చేప్పారని ఆయన వివరించారు. షాప్స్ వద్ద రంగులతో శాశ్విత మార్కింగ్ చేయాలని సీఎం చెప్పారన్నారు. షాప్స్ వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని…

క్వారంటీన్, ఐసోలాషన్ సెంటర్స్ లో కనీస వసతులు ఉండాలి…నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. వలస కూలీలకు 236 క్యాంపులు నడుపుతున్నామని చెప్పుకొచ్చారు. దీనికి ప్రత్యేక అధికారులను కూడా నియమించారని అన్నారు. వారి వసతులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని వివరించారు. ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదని సీఎం గారు స్పష్టంగా చెప్పారని, 78 వేల మంది ఉంటే 16 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతులు ఇస్తోందని వివరించారు. మిగిలిన వారికి ఆయా సంస్థలు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news