భైంసాలో అర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. శాంతిభద్రతల దృశ్య భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు నిర్మల్ పోలీసులు. అయితే అనుమతి నిరాకరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్ఎస్ఎస్. ఈ నేపథ్యంలో రూట్ మ్యాప్ ను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ ను కోరింది హైకోర్ట్. ఆర్టికల్ 19 ప్రకారం సభలు, ర్యాలీలు ఎవరైనా నిర్వహిచవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే లా అండ్ అడర్ సమస్య వల్లే అనుమతి నిరాకరించామని తెలిపారు జిపి. ర్యాలికి మినహాయించి సభ కు అనుమతి ఇచ్చేoదుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ర్యాలీ కి అనుమతి ఇస్తే శాంతి భద్రత సమస్య వస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీ వల్ల 15 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చిందని జిపి వివరించారు. ఈ నేపథ్యంలో బైoసా లో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి పై 2:30 కు హైకోర్ట్ తీర్పు వెలువరించనుంది.