వైసీపీలో టీడీపీ వాలంటీర్లు..తీసేయలంటున్న ఎమ్మెల్యే!

-

వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీరుని నియమించారు. ఈ వాలంటీర్ పని కేవలం అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడం. కానీ వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలు అనే సంగతి తెలిసిందే. ఆ విషయం వైసీపీ నేతలు పలుమార్లు చెప్పారు. అందుకే వైసీపీని గెలిపించడానికి వారు పనిచేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపించడానికి వాలంటీర్లు ఎలా కృషి చేశారో తెలిసిందే.

కొన్ని చోట్ల వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయని చెప్పి మరీ ఓట్లు వేయించారు. ఇక వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే పథకాలు పోతాయనే విధంగా వాలంటీర్లు ముందుకెళ్లారు. దాదాపు 80 శాతం వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు. ఇదే క్రమంలో జగన్..ఎన్నికల్లో గెలవడానికి గృహసారథులని నియమిస్తున్న విషయం తెలిసిందే. అటు సచివాలయ కన్వీనర్లని నియమిస్తున్నారు. ఇలా నియమించే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Like Dad Vasantha, Son Too Faults Jagan Govt

వాలంటీర్లలో టీడీపీ  సానుభూతిపరులు ఉంటే వారిని తక్షణమే తొలగిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన సమయంలో టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామని,  వారు మారతారేమోనని వేచిచూశామని,  కానీ వారిలో ఎటువంటి మార్పు రాలేదని, కొంతమంది మారారని, మరికొంతమది మారలేదని, అటువంటివారిని సొంత నాయకులు గుర్తించి.. చెబితే వెంటనే వారిని తొలగిస్తామని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

అయితే వాలంటీర్లు అనేవారికి ప్రభుత్వ జీతాలు ఇస్తున్నారు..అలాంటప్పుడు వారు ప్రభుత్వానికి పనిచేయాలి తప్ప పార్టీకి కాదు..కానీ వైసీపీ నేతలు పూర్తిగా పార్టీ కోసం వాలంటీర్లని వాడుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లలో టి‌డి‌పి వాళ్ళు ఉన్నారని చెప్పి వసంత మాట్లాడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news