ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. నేడు మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చాలా కాలంగా ఉన్న విషయం తెలిసిందే. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇదే అంశంపై అమరణ దీక్ష కూడా చేశారు.
అలాగే మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య కూడా ఇదే అంశంపై గత ఏడాది డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసి నిరాహార దీక్షకు దిగారు. ఆ తర్వాత ఆయనని పోలీసులు అరెస్టు చేయడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన నిరాహార దీక్షను విరమించడం జరిగిపోయాయి. అయితే నేడు హైకోర్టులో హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ ని సిజే బెంచ్ కు బదిలీ చేస్తామన్నారు హైకోర్టు న్యాయమూర్తి.